ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఘనంగా ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు

TRS MPs Partcipated in Prof Jayashankar Jayanthi Celebrations at Telangana Bhavan in New Delhi

ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఆచార్య జయశంకర్ సార్ 87వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు బండ ప్రకాష్, బిబి పాటిల్, ఎమ్ కవిత, వెంకటేష్ నేత, బడుగుల లింగయ్య యాదవ్, పసునూరి దయాకర్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి, బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విసి ప్రో. సీతారామరావు, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డా. గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు. ఆచార్య జయశంకర్ చిత్రపటానికి ఎంపీలు మరియు ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి, పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా రాజ్యసభ ఎంపీ డా.బండ ప్రకాష్ ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనితర కృషి చేసిన వ్యక్తి ప్రో, జయశంకర్ అని చెప్పారు. “ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయాలను ఎలుగెత్తి పోరాడాడు. సాధించుకునే తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండాలని ఒక విజన్ కలిగిన వ్యక్తి ఆయన. ఉద్యమంలో ఆయనతో కలిసి పనిచేసినందుకు సంతోషంగా ఉంది. వారి ఆలోచనలకు అనుగుణంగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ముందుకు సాగుతోంది. ప్రో. జయశంకర్ కలలుగన్న అన్నివర్గాల అభివృద్ధి సాకారం అవుతోంది” అని అన్నారు.

రాజ్యసభ ఎంపీబడుగుల లింగయ్య మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయంపై ప్రో.జయశంకర్ పోరాడారు. ఆయన ఆశించినట్లుగా తెలంగాణలో గడచిన 7ఏళ్లుగా పాలన సాగుతోంది. బడుగుల సంక్షేమం, అభివృద్ధి లో రాష్ట్రం ముందుకు వెళుతుంది. దళిత బంధు, రైతులకు బీమా, ఉచిత కరెంటు ఇలా అనేక పథకాలు అన్ని వర్గాల అభివృద్ధికి దోహదం చేస్తున్నాయి. జయశంకర్ కోరుకున్న సమాజం రానున్న రోజుల్లో సాకారం అవుతుందన్నారు.

ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సందర్భంలో ఆచార్య జయశంకర్ ను గుర్తు చేసుకున్నారు. సిద్దించిన తెలంగాణను ఆయన చూడలేదని సీఎం బాధ పడుతూ ఉంటారు. జయశంకర్ ఆలోచన విధానంలోనే తెలంగాణ పథకాలు ఉన్నాయి. ఆయన స్పూర్తితో ప్రజాప్రతినిధులుగా తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఎంపీ పసునూరి దయాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం రావడానికి ఆయన కృషి మరువలేనిది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయలపై ఆయన పోరాడారు. అనేక పుస్తకాలు రచించారు, వ్యాసాలు రాసారు. ఉద్యమంలో ఆచార్య జయశంకర్ తో కలిసి పనిచేసినందుకు సంతోషంగా ఉంది. ఆయన స్పీచ్ లను ఆదర్శంగా తీసుకొని ఉద్యమంలో పాల్గొన్నాను. ఆయన ఆలోచనకు తగ్గట్టుగా దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు.

ఎంపీ బిబి పాటిల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రో, జయశంకర్ పాత్ర మరువలేనిది. ఆయన ఆలోచనలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతుంది. ప్రో. జయశంకర్ ను ప్రతి ఒక్కరు స్మరించుకోవాలి. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ గా నిలుస్తోందన్నారు. ఎంపీ వెంకటేష్ నేత మాట్లాడుతూ 4 కోట్ల తెలంగాణ ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తి నింపిన వ్యక్తి ప్రో. జయశంకర్ అని కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు దిశానిర్దేశం చేసిన వ్యక్తి ఆయన. అభివృద్ధి, సంక్షేమలో అన్నివర్గాలను కలుపుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు సాగుతున్నారు . సామాజిక న్యాయం, అభివృద్ధి, సంక్షేమం దిశగా తెలంగాణ ముందుకు సాగుతోందని తెలిపారు.

భూపాల్ పల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి మాట్లాడుతూ, బ్రతుకున్నంత కాలం తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి ఆచార్య జయశంకర్. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కార్యాచరణ సిద్ధం చేశారు. నేను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ జిల్లాకు సీఎం కేసీఆర్ జయశంకర్ పేరు పెట్టారు. ఆయనను స్మరించుకోవడం తెలంగాణ ప్రజలకు గర్వకారణం. ఆయన అడుగుజాడల్లో తెలంగాణ సమాజం ముందుకు పోతోందన్నారు. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ప్రో. సీతారామరావు మాట్లాడుతూ, ఆచార్య జయశంకర్ తో ఉద్యమంలో కలిసి పనిచేసిన అదృష్టం నాకు దక్కింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఎలా ఉండాలని ఆయనకు గొప్ప స్వప్నం ఉండేది. ఆయన స్వప్నంను నిజం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన సాగుతోంది. ఉన్నత విద్యా రంగానికి జయశంకర్ చేసిన సేవలు మరువలేనివి. ఆ రోజుల్లో మాలాంటి యువ ప్రొఫెసర్లకు ఆయన ఆదర్శంగా నిలిచారు. మానవీయమైన సమ సమాజ నిర్మాణం కోసం మనం ప్రతిజ్ఞ తీసుకొని రాష్ట్ర అభివృద్ధికి ముందుకు నడవాలి. అలాగే ఈ కార్యక్రమంలో తెలంగాణ భవన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + 8 =