దేశంలోని టాప్‌ 8 సిటీలలో హౌసింగ్ డిమాండ్‌ .. బాగా పెరిగిన ధరలు

Housing Prices Across Top 8 Cities in India Increased 7% in 2nd Quarter 2023 Along with Hyderabad,Housing Prices Across Top 8 Cities,Top 8 Cities in India Increased 7%,Increased 7% in 2nd Quarter 2023,Top 8 Cities in India Increased,Mango News,Mango News Telugu,Overall housing prices in India,Hyderabad, Bangalore, Ahmedabad, Chennai, Delhi, Kolkata, Mumbai, Pune, Housing demand in the top 8 cities of the country, greatly increased prices,Housing Prices Latest News,Housing Prices Latest Updates,Housing Prices Live News

హైదరాబాద్‌లో గతేడాది జూన్ క్వార్టర్‌తో పోలిస్తే ఈ సంవత్సరం జూన్ క్వార్టర్‌లో ఇండ్ల ధరలు 13 శాతం పెరిగిపోయాయి. చదరపు అడుగు సగటు ధర ఏకంగా రూ. 10,530 కి చేరిపోయింది. క్రెడాయ్‌, లియాసెస్‌ ఫోరస్, కొలియర్స్‌ అంతా కలిసి జాయింట్గా విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం, ఈ సంవత్సరం జూన్ క్వార్టర్‌లో కోల్‌కతాలో ఇళ్ల ధరలు బాగా పెరిగాయి. అంటే ఇయర్ ఆన్ ఇయర్ ప్రకారం ఈ ధరలు 15 శాతం పెరిగాయి.

అలాగే ఎన్‌సీఆర్‌లో రెసిడెన్షియల్ ప్రాపర్టీ రేట్లు కూడా 14 శాతం గ్రోత్‌ను నమోదు చేశాయి. ముంబైలో మాత్రం ఇండ్ల ధరలు 3 శాతం తగ్గాయి. ఇండ్లు కొనడానికి జనాలు ఆసక్తి చూపిస్తుండడం, వడ్డీ రేట్లు నిలకడగా ఉండడం, ప్రజల ఆదాయాలు మెరుగుపడడంతో హౌసింగ్ డిమాండ్‌ నిలకడగా పెరుగుతోందని పైన పేర్కొన్న రిపోర్ట్ వెల్లడించింది. కేవలం సేల్స్ మాత్రమే కాకుండా మార్కెట్‌లోకి వస్తున్న కొత్త లాంచ్‌లు కూడా కొన్ని క్వార్టర్లుగా పెరిగాయని వివరించింది.

ఫలితంగా అమ్ముడుకాకుండా మిగిలిపోతున్న ఇండ్లు కూడా పెరిగాయని, దేశం మొత్తం మీద ఇలాంటి ఇండ్లు 13 శాతం (ఇయర్‌ ఆన్ ఇయర్) పెరిగాయని క్రెడాయ్‌, కొలియర్స్‌, లియాసెస్‌ ఫోరస్‌ రిపోర్ట్‌ తెలిపింది. ఈ రిపోర్ట్ ప్రకారం, పెద్ద పెద్ద ఇళ్లకు డిమాండ్ పెరుగుతోంది. డెవలపర్లు కూడా ఎక్కువగా హై ఎండ్ ప్రాజెక్ట్‌లనే లాంచ్ చేస్తున్నారు. దీంతో హైదరాబాద్‌, కోల్‌కతా, ఢిల్లీ, బెంగళూరు మార్కెట్లలో ఇళ్ల ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.

దేశం మొత్తం మీద జరుగుతున్న అమ్మకాలను చూస్తే.. ప్రజలు ఇళ్లు కొనడానికి కరోనా తర్వాత బాగా ముందుకు వస్తున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. పెంటప్‌ డిమాండ్ వల్ల కరోనా తర్వాత ఇళ్లు భారీ సంఖ్యలో సేల్స్ అవుతున్నాయని.. రేట్లు పెరిగినా ఇల్లు కొనాలనుకునేవారు పట్టించుకోవడం లేదని చెప్పారు. దీనికి తోడు వడ్డీ రేట్లు నిలకడగా ఉండడంతో పాటు.. ఫెస్టివ్ సీజన్ ప్రారంభం కానుండడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా ఇదే మూమెంట్ కొనసాగొచ్చని అంచనా వేస్తున్నారు.

హైదరాబాద్‌, బెంగళూరు, అహ్మదాబాద్‌, చెన్నై, ఢిల్లీ,కోల్‌కతా, ముంబై , పూనే సిటీల ఇళ్ల ధరలను గమనించినట్లయితే.. ఎక్కువగా కోల్‌కతాలో పెరిగాయి. ఈ సంవత్సరం జూన్‌తో ముగిసిన క్వార్టర్‌లో కోల్‌కతాలో చదరపు అడుగు సగటు ధర రూ.7,315 గా నమోదయింది. ఇళ్ల ధరలు అయితే క్వార్టర్ వన్‌లో క్రితం సంవత్సరం జూన్ క్వార్టర్‌తో పోలిస్తే 15 శాతం పెరిగాయి.ఎందుకంటే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం స్టాంప్‌డ్యూటీని 2 శాతం తగ్గించడం ప్లస్ అవడమేనని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు సర్కిల్‌ రేట్లను కూడా ఈ సంవత్సరం సెప్టెంబర్‌ వరకు 10 శాతం తగ్గించడం మరో ప్లస్.దీని వల్ల ఇళ్లకు భారీగా డిమాండ్ పెరిగిపోయింది.

ఢిల్లీలో అయితే.. గోల్ఫ్‌ కోర్స్‌ రోడ్‌, ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే చుట్టుపక్కల ఇళ్ల ధరలు క్వార్టర్ వన్‌లో.. ఇయర్ ఆన్ ఇయర్ ప్రకారం చూస్తే.. 40 శాతానికి పైగా పెరిగాయి. బెంగళూరులో క్వార్టర్ వన్‌లో ఇళ్ల ధరలు అయితే..10 శాతం పెరిగాయి. 3 బీహెచ్‌కే రేట్లు 12 శాతం వరకూ పెరిగాయి. ఇటు హైదరాబాద్‌, అహ్మదాబాద్ సిటీలలో అమ్ముడు పోని ఇళ్లు 25 శాతం పెరిగినా కూడా.. ఈ సిటీలలో ఇళ్ల ధరలు నిలకడగా పెరుగుతున్నాయని క్రెడాయ్‌, కొలియర్స్ రిపోర్ట్ తెలిపింది.

నిజానికి 10 క్వార్టర్ల నుంచి ఇళ్ల రేట్లు పెరుగుతూ వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచి రెపో రేటు 6.5 శాతం దగ్గరే స్టేబుల్‌గా ఉండటంతో.. హోమ్‌బయ్యర్లు చెల్లించే ఈఎంఐలు నిలకడగా ఉన్నాయి. మరోవైపు కన్‌స్ట్రక్షన్ ఖర్చులు పెరిగిపోవడంతో డెవలపర్లు ఇబ్బంది పడుతున్నా, హౌసింగ్ డిమాండ్‌ మాత్రం తగ్గడం లేదని నిపుణులు చెబుతున్నారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాగా అభివృద్ధి చెందడం, కనెక్టివిటీని బాగా మెరుగుపరచడం, పెరిగిన ప్రజల ఆదాయాలతో పాటు..ప్రభుత్వం ఇస్తున్న ఇన్సెంటివ్స్‌ పెరగడం వల్ల.. దేశంలోని టాప్‌ 8 సిటీలలో హౌసింగ్ డిమాండ్‌ పెరుగుతోందని చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − one =