రేపు భద్రాచలంలో పర్యటించనున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై.. వరద ప్రభావ ప్రాంతాల పరిశీలన

Telangana Governor Tamilisai To Visit Flood Affected Areas of Bhadradri Kothagudem District Tomorrow, Governor Tamilisai To Visit Flood Affected Areas of Bhadradri Kothagudem District Tomorrow, Tamilisai Soundararajan To Visit Flood Affected Areas of Bhadradri Kothagudem District Tomorrow, Telangana Governor To Visit Flood Affected Areas of Bhadradri Kothagudem District Tomorrow, Flood Affected Areas of Bhadradri Kothagudem District, Bhadradri Kothagudem District Flood Affected Areas, Flood Affected Areas, Bhadradri Kothagudem District, Telangana Governor Tamilisai Soundararajan, Governor Tamilisai Soundararajan, Tamilisai Soundararajan, Telangana Governor, Governor of Telangana, Bhadradri Kothagudem District News, Bhadradri Kothagudem District Latest News, Bhadradri Kothagudem District Latest Updates, Bhadradri Kothagudem District Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణలో గడచిన వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు పలు జిల్లాలు జలమయమయ్యాయి. ఇంకొన్ని జిల్లాల్లో వరదల ధాటికి లోతట్టు ప్రాంతాలు చాలావరకు నీటమునిగాయి. మరోవైపు భారీ వర్షాలు, వరదలు కారణంగా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర పంట నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా సంభవించింది. ఇక, గోదావరికి చేరుతున్న అసాధారణ వరద ఉధృతి కారణంగా రికార్డు స్థాయిలో నీటి ప్రవాహం ప్రవహిస్తుండటంతో భద్రాచలం నీట ముగినింది. ఈ నేపథ్యంలో తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. వరద ప్రభావ ప్రాంతాలను పరిశీలించనున్నారు.

ఈ క్రమంలో గవర్నర్‌ శనివారం రాత్రి సికింద్రాబాద్‌ నుంచి రైలులో పయనమై ముందుగా కొత్తగూడెంకు చేరుకోనున్నారు. అక్కడినుంచి రోడ్డు మార్గాన భద్రాచలం చేరుకోనున్నారు. వరద ప్రభావ ప్రాంతాల పరిశీలనతో పాటుగా వరదల వలన తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్న బాధితుల కుటుంబాలను కూడా పరామర్శించనున్నారు. కాగా ఈరోజు ఢిల్లీలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఇవ్వనున్న విందులకు గవర్నర్‌ హాజరు కావాల్సి ఉంది. అయితే భద్రాచలం పర్యటన నేపథ్యంలో ఢిల్లీ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు సీఎం కేసీఆర్ కూడా రేపు భద్రాచలం ప్రాంతంలో ఏరియల్ సర్వే చేయనున్నారు. తద్వారా గోదావరి పరీవాహక ప్రాంతంలో వరద ప్రభావాన్ని అంచనా వేయనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 1 =