రాష్ట్రంలో నేతన్నకు చేయూత పొదుపు పథకం పునఃప్రారంభం

Decision on revival of Nethanna ku Cheyutha scheme, Mango News, Nethannaku Cheyutha, Nethannaku Cheyutha Scheme, Nethannaku Cheyutha Scheme In Telangana, Nethannaku Cheyutha Scheme News, revival of Nethanna ku Cheyutha scheme, Revive Nethannaku Cheyutha Scheme, Telangana Govt, Telangana Govt Decides to Revive Nethannaku Cheyutha Scheme, Telangana govt will stand by weavers, Telangana Nethannaku Cheyutha Scheme

తెలంగాణ రాష్ట్రంలోని నేతన్నలకు చేయూతగా నిలిచిన పొదుపు పథకం “నేతన్నకు చేయూత” కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, టెక్స్ టైల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. సోమవారం నాడు ప్రగతి భవన్ లో టెక్స్ టైల్ శాఖపై నిర్వహించిన సమీక్ష సందర్భంగా మంత్రి కేటీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని చేనేత మరియు మరమగ్గ కార్మికులు ఈ పొదుపు పథకంలో భాగస్వామలు కావచ్చని చెప్పారు. ఈ పథకంలో భాగంగా చేనేత కార్మికుడు జమ చేసుకునే 8 శాతం వేతన వాటాకు రెట్టింపు వాటాను 16% ప్రభుత్వం జమ చేస్తుందని తెలిపారు.

అలాగే దీంతోపాటు మరమగ్గ కార్మికులు చేసే 8 శాతం వేతన వాటాకు సమానంగా మరో 8 శాతం వాటాను ప్రభుత్వం జమచేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న సుమారు 25 వేల మంది చేనేత కార్మికులకు, మరో 10 వేల మంది పవర్ లూమ్ కార్మికులకు ఈ పొదుపు పథకం భరోసాను ఇస్తుందని మంత్రి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కేవలం చేనేతలకే ఉన్న ఈ పథకాన్ని విస్తరించి పవర్ లూమ్ కార్మికులకు కూడా ఈ పొదుపు సౌకర్యం కల్పించామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here