హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి.. రేపు హుస్సేన్ సాగర్‌కు తరలి రానున్న ఖైరతాబాద్ మహాగణపతి

Hyderabad Huge Arrangements Set For Khairatabad Maha Ganapati Idol Immersion At Hussain Sagar, Khairatabad Maha Ganapati Idol Immersion At Hussain Sagar, Huge Arrangements For Khairatabad Maha Ganapati Idol, Khairatabad Maha Ganapati Idol Immersion, Mango News, Mango News Telugu, Khairatabad Maha Ganapati , Ganapati Idol Immersion At Hussain Sagar, Huge Arrangements Set For Khairatabad Maha Ganapati Idol Immersion, Ganapati Immersion, Khairatabad Ganesh News And Live Updates, Ganapati Idol Immersion

హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ వద్ద గణేష్ విగ్రహాల సామూహిక నిమజ్జనానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ క్రమంలో రేపు ఊరేగింపుగా తరలివచ్చే వందల కొలదీ వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు హుస్సేన్ సాగర్ చుట్టూ భారీ ఏర్పాట్లు చేసింది. నిమజ్జన ప్రదేశాల్లో ఇప్పటికే సుమారు 20 క్రేన్లను మోహరించారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) అధికారులు. మరోవైపు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో పోలీసు శాఖ సహకారంతో హుస్సేన్‌ సాగర్‌తో పాటు సరూర్‌ నగర్ సరస్సు, మరో 60 నీటి వనరులలో గణేష్ నిమజ్జనాన్ని నిర్వహించాడానికి ఏర్పాట్లు చేసింది. ఇక నిమజ్జనం సందర్భంగా ఎలాంటి ఆంక్షలు లేవని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

మరోవైపు హైదరాబాద్‌ నగరం లోని అన్ని విభాగాలు ఈ ప్రక్రియలో పాలుపంచుకుంటాయని అధికారులు తెలిపారు. శానిటేషన్ వాటర్ వర్క్స్, జీహెచ్ఎంసీతో ట్రాఫిక్ పోలీసులు సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. ఇక ఈ క్రమంలో ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహం కూడా రేపు నిమజ్జనానికి బయలుదేరనున్నట్లు కమిటీ నిర్వాహకులు తెలిపారు. దీనికోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. కాగా నిమజ్జనం సందర్భంగా ఎలాంటి పొరపాట్లకు తావీయకుండా నగర పోలీసులు పటిష్ట భద్రత కల్పిస్తున్నారు. దీనిలో భాగంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో సుమారు 200 సీసీ కెమెరాలు అమర్చారు. అలాగే 12 వేల మందికి పైగా పోలీసులను మోహరిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + 9 =