తెలంగాణలో ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తు గడువు పొడిగింపు

Layout Regularization Scheme, Layout Regularization Scheme 2020, LRS 2020 deadline extended, LRS deadline extended, LRS last date extended, LRS last date extended till Oct 31, telangana, Telangana Extend Last Date for LRS, Telangana Govt Extend Last Date for Filing Applications under LRS, Telangana Govt extends deadline for LRS

తెలంగాణ రాష్ట్రంలో లే అవుట్‌ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్‌) దరఖాస్తుల గడువును అక్టోబర్‌ 31 వ తేదీ వరకు పొడిగిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ‌ముందుగా రాష్ట్రంలో అనధికార ఫ్లాట్లు, అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం మరో అవకాశం కల్పిస్తూ అక్టోబర్ 15 వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు నిర్ణయించింది. అయితే ఇటీవల భారీ వర్షాల కారణంగా ఇంటర్నెట్ సేవలు మరియు అనేక చోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడడంతో చాలా మంది ప్రజలు తమ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను దాఖలు చేయలేకపోయారని ప్రభుత్వానికి నివేదికలు వచ్చాయి. దీంతో దరఖాస్తులను దాఖలు చేయడానికి చివరి తేదీని పొడిగించాలని అభ్యర్థనలు రావడంతో అక్టోబర్ 30 వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

హెచ్ఎండీఏ స‌హా రాష్ట్రంలో అన్ని కార్పోరేష‌న్లు, మునిసిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో లే అవుట్‌ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) కు ప్రభుత్వం అవ‌కాశం ఇచ్చింది. ఆగస్టు 26 లోపు డెవలప్ చేసిన లే అవుట్లు, రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్లాట్ కు ఎల్‌ఆర్‌ఎస్‌కు అవకాశం కల్పించారు. రాష్ట్రంలో ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తుదారుల నుంచి పెద్దఎత్తున స్పందన వచ్చింది. గురువారం రాత్రి 9 గంటల వరకు ఎల్‌ఆర్‌ఎస్‌కు సంబంధించి 19.33 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినట్టు ప్రభుత్వం ప్రకటించింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − eight =