మందుబాబులకు శుభవార్త, తెలంగాణ‌లో బార్లు, క్ల‌బ్బులు ఓపెన్‌

All bars and clubs opens with immediate effect, All bars and clubs opens with immediate effect in Telangana, Clubs and Tourism Bars Open in Telangana, Hyderabad lockdown news, Hyderabad to open bars, telangana, Telangana Bars Open, Telangana Govt Gives Permit to Reopen All Bars, Telangana unlockdown guidelines

రాష్ట్రంలో బార్లు తెరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మార్చి 22 న మొదటిసారిగా లాక్ డౌన్ విధించినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో బార్లు మూసివేసే ఉంచారు. తాజాగా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా బార్స్, క్లబ్బులు మరియు టూరిజం బార్లు తెరిచేందుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం పేర్కొంది. అన్ని బార్లు, క్లబ్స్ లో క‌రోనా నిబంధ‌న‌లు క‌చ్చితంగా పాటించాల‌ని ప్ర‌భుత్వం ఆదేశాలు ఇచ్చింది.

బార్లు, క్లబ్స్, టూరిజం బార్లులలో పాటించాల్సిన నియమాలు:

  • బార్ల ఎంట్రీ పాయింట్ వద్ద నాన్ టచ్ ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్స్/థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయాలి.
  • సరైన క్యూ విధానం పాటించాలి, పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలి.
  • పార్కింగ్‌ ప్రాంతంలో గుంపులు గుంపులుగా ఉండకుండా చూడాలి.
  • హ్యాండ్ శానిటైజర్ కోసం సదుపాయం కల్పించాలి.
  • బార్ సిబ్బంది మరియు పనిచేసే వారంతా మాస్కులు ధరించాలి.
  • సమావేశాలు, మ్యూజిక్ ఈవెంట్స్, డ్యాన్స్ ఫ్లోర్స్ పై నిషేధం.
  • ప్రతి రోజు ఉదయం మరియు సాయంత్రం మొత్తం బార్ ప్రాంగణాలను శుభ్రపరచడం మరియు శానిటైజషన్ చేయాలి.
  • కొత్త కస్టమర్ సీటులోకి వచ్చే ముందు సీటును శానిటైజ్ చేయాలి.
  • బార్ ప్రాంగణంలో సరైన వెంటిలేషన్ ఏర్పాటు చేయాలి.
  • A4 షాప్స్ ప‌ర్మిట్ రూమ్‌ల‌ను తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు మూసే ఉంచాలి.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 4 =