తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 15 ఫైర్ స్టేషన్లు ఏర్పాటు, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

Telangana Govt Issues Orders for Establishment of 15 New Fire Stations in the State,Telangana Govt,Telangana Approves Establishment,Telangana Govt 15 Fire Stations,15 Fire Stations In Telangana,Mango News,Mango News Telugu,Telangana Govt Latest News And Updates,Telangana Establishment on 15 Fire Stations,15 Fire Stations,15 Fire Stations Opening in Telangana,Telangana News And Live Updates,Telangana News,Fire Stations In State

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా 15 ఫైర్ స్టేషన్లను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 16, బుధవారం నాడు ఉత్తర్వులు జారీచేసింది. ఈ కొత్త 15 ఫైర్ స్టేషన్లతో పాటుగా 382 పోస్టులను కూడా మంజూరు చేస్తూ జీ.ఓ.ఎం.ఎస్ నెంబర్ 64 పేరుతో బుధవారం రాష్ట్ర ప్రభుత్వ హోం శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు. ఇక మంజూరైన 382 పోస్టుల్లో 367 రెగ్యులర్ పోస్టులు కాగా, 15 పోస్టులను అవుట్ సోర్సింగ్ పద్దతిలో చేపట్టేందుకు అనుమతి ఇచ్చినట్టు తెలిపారు. కాగా రాష్ట్రంలో ఇప్పటివరకు ఫైర్ స్టేషన్లు లేని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ కొత్త ఫైర్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

కొత్తగా ఏర్పాటయ్యే 15 ఫైర్ స్టేషన్ల వివరాలు (నియోజక వర్గాల వారీగా):

  • మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా – మల్కాజిగిరి
  • రంగారెడ్డి జిల్లా – ఎల్బీనగర్, రాజేంద్రనగర్, షాద్ నగర్
  • హైదరాబాద్ జిల్లా – అంబర్ పేట్, చాంద్రాయణ గుట్ట, జూబ్లీ హిల్స్
  • జనగామ జిల్లా – స్టేషన్ ఘనపూర్
  • మహబూబాబాద్ జిల్లా – డోర్నకల్
  • మెదక్ జిల్లా – నర్సాపూర్
  • సిద్ధిపేట జిల్లా – హుస్నాబాద్
  • నాగర్ కర్నూల్ జిల్లా – కల్వకుర్తి
  • నిజామాబాద్ జిల్లా – బాల్కొండ
  • జగిత్యాల జిల్లా – ధర్మపురి
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా – పినపాక.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 14 =