అమరావతి భూములు, ఫైబర్‌నెట్ కుంభకోణం: ‘సిట్‌పై స్టే’ పిటీషన్‌పై సుప్రీంకోర్టులో ముగిసిన వాదనలు, తీర్పు రిజర్వ్

Amaravti Lands and Fibernet Case Arguments Concluded in Supreme Court Over HC Stay on SIT Judgment Reserved,Amaravati lands, Fibernet scam, Arguments concluded in Supreme Court,stay on sit petition, judgment reserved,Mango News,Mango News Telugu,Amaravati Maha Padayatra,Maha Padayatra,Amaravati Padayatra,Amaravati Interim Petition In HC,Andhra Pradesh High Court,Amaravati Padayatra Latest News And Updates,AP HC News And Live Updates

అమరావతి భూములు, ఫైబర్‌నెట్ కుంభకోణం కేసులో సిట్‌ విచారణను నిలిపివేస్తూ హైకోర్టు విధించిన స్టేపై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్‌పై గురువారం విచారణ చేసిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. టీడీపీ ప్రభుత్వం తీసుకున్న పలు విధానపరమైన మరియు ఆర్థికపరమైన నిర్ణయాలు సహా ఇతర అంశాలపై ఏపీ ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేయగా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజాలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌పై గత ఏడాది సెప్టెంబర్ 15న స్టే విధించింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటీషన్‌ వేసింది. ఈ క్రమంలో నేడు తుది వాదనలు జరిగాయి.

ఈ సందర్భంగా సుప్రీంకోర్టు గురువారం తుది విచారణ చేసింది. టీడీపీ నేతల తరపున సీనియర్ కౌన్సిల్ సిద్ధార్ధ దవే వాదనలు వినిపించగా, ప్రభుత్వం తరపున సీనియర్ కౌన్సిల్ అభిషేక్ మనుసింఘ్వీ వాదించారు. సిట్‌ దర్యాప్తుపై హైకోర్టు స్టే విధించినా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడాన్ని కోటు దృష్టికి తెచ్చిన సిద్ధార్ధ దవే, రాజకీయ దురుద్దేశంతోనే సిట్‌ను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఇక ఏపీ ప్రభుత్వం వాదనలను అభిషేక్ మనుసింఘ్వీ బుధవారమే పూర్తి చేశారు. చట్ట ప్రకారం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా సిట్ వేసే అధికారం ప్రభుత్వానికి ఉందని ఆయన తెలిపారు. చట్ట ప్రకారం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా సిట్ వేసే అధికారం ప్రభుత్వానికి ఉందని ఆయన తెలిపారు. ఇందులో ఎలాంటి రాజకీయ కక్ష సాధింపేమీ లేదని, విచారణ నిష్పాక్షికంగా జరగాలని దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం సీబీఐకి కూడా లేఖ రాసిందని సింఘ్వీ వెల్లడించారు. ఇక ఇరువైపు వాదనలు విన్న సుప్రీం కోర్టు తీర్పును రిజర్వు చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × three =