రాజ్‌భవన్‌లో ఎట్‌హోం కార్యక్రమానికి హాజరైన సీఎం కేసీఆర్, మంత్రులు

Governor Tamilisai Organized at Home at Raj Bhavan,Mango News,Latest Breaking News 2020,Governor Tamilisai Republic Day Celebrations 2020,Republic Day 2020,71st Republic Day celebrations,Republic Day 2020 Highlights,Republic Day parade in India,Governor Tamilisai Republic Day at Raj Bhavan
జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్‌భవన్‌లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఎట్‌హోం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు, శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, శాసన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, పలువురు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీలకు చెందిన ముఖ్యనేతలు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులకు గవర్నర్‌ తమిళిసై విందు ఇచ్చారు.
అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజ్‌భవన్‌లో కూడా గణతంత్ర దినోత్సవ సందర్భంగా గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఎట్‌హోం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి, శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, శాసన మండలి ఛైర్మన్‌ షరీఫ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, పలువురు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. కార్యక్రమానికి హాజరైన పలువురు అతిథులతో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ ముచ్చటించారు.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here