హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానం: ఆధిక్యంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సురభి వాణీదేవి

Mango News, Surabhi Vani Devi, Surabhi Vani Devi is in Lead, Surabhi Vani Devi leads in Hyderabad graduate MLC, Telangana Graduates MLC Elections, Telangana Graduates MLC Elections Counting, Telangana Graduates MLC Elections Results, Telangana MLC Elections, Telangana MLC Elections 2021, Telangana MLC Elections 2021 Results, Telangana MLC Elections Counting, Telangana MLC Elections Results, Telangana MLC Elections Results Live Updates, Telangana MLC polls, TRS Candidate Surabhi Vani Devi is in Lead, TRS candidate Surabhi Vani Devi News

తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సురభి వాణీదేవి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తం మూడు రౌండ్ల కౌంటింగ్ ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవికి 53,007 ఓట్లు లభించాయి. బీజేపీ అభ్యర్థి రామచంద్రరావుకు 48,563 ఓట్లు, ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు 25,505 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి జి.చిన్నారెడ్డికి 10,062 ఓట్లు, టీడీపీ అభ్యర్థి ఎల్.రమణకు 2,673 ఓట్లు లభించాయి. మూడు రౌండ్ల కౌంటింగ్ అనంతరం సమీప బీజేపీ అభ్యర్థి కంటే వాణీదేవి 4,444 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానానికి మార్చి 14 న పోలింగ్ జరగగా 67.26 శాతం అనగా 3,57,354 మంది ఓటర్లు తమ హక్కు వినియోగించుకున్నారు. ఈ స్థానంలో మొత్తం 93 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో బుధవారం ఉదయం 8 గంటల నుంచి జరుగుతుంది. ఓక్కో రౌండ్‌లో 56,000 ఓట్ల చొప్పున లెక్కిస్తున్నారు. మొత్తం ఏడు రౌండ్ల లెక్కింపు నిర్వహించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 − 1 =