నూతన సచివాలయ నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్

CM KCR Visited and Inspected Progress of Construction Works, Construction Works of New Secretariat Building, KCR Inspected Progress of Construction Works of New Secretariat Building, Mango News, New Secretariat Building, Telangana CM KCR, Telangana New Secretariat, Telangana New Secretariat Building, Telangana New Secretariat Construction, Telangana New Secretariat Construction Contract, telangana secretariat, Telangana Secretariat Construction

తెలంగాణ సచివాలయ నిర్మాణ కౌశలం దేశానికే వన్నెతెచ్చే విధంగా, అలంకృత రూపంతో అద్భుతంగా వుండాలని, పదికాలాల పాటు నిలిచివుండే తెలంగాణ సెక్రటేరియట్ ను పటిష్టమైన రీతిలో నిర్మించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. నూతనంగా నిర్మిస్తున్న సచివాలయ పనుల పురోగతిని సీఎం కేసీఆర్ గురువారం నాడు పరిశీలించారు. సచివాలయ నిర్మాణంలో సుందరీకరణ కోసం వినియోగించేందుకు రాజస్థాన్ నుంచి తెప్పించిన రెడ్ సాండ్ స్టోన్, బీజ్ స్టాండ్ స్టోన్, నాచురల్ బీజ్, నాచురల్ గ్వాలియర్ స్టోన్స్ నమూనాలను సీఎం పరిశీలించారు. సచివాలయ నైరుతి దిక్కు ప్రాంతాన్ని కాలినడకన కలియతిరిగి, నిర్మాణంలో వున్న పిల్లర్లను, బీమ్ ల నాణ్యతను, పనితీరును పరిశీలించారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, అధికారులు సహా వర్క్ ఏజెన్సీ ప్రతినిధులకు నిర్మాణాల్లో చేపట్టవలసిన చర్యలకు సంబంధించి పలు సూచనలు చేశారు.

అనంతరం ప్రగతి భవన్ లో సెక్రటేరియట్ నిర్మాణంపై సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, ‘‘సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం, అనతికాలంలోనే అభివృద్ది సంక్షేమ రంగాల్లో దేశానికే మార్గదర్శిగా పాలన సాగుతున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆత్మగౌరవం మరింత ఇనుమడించేలా, తెలంగాణ రాష్ట్ర పాలనా కేంద్రమైన సచివాలయాన్ని మనం నిర్మించుకోవాలి. దేశం గర్వించే విధంగా పలు రాష్ట్రాలకు ఆదర్శంగా మన సచివాలయం నిలువాలి. ఉద్యోగులకు సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచే విధంగా వాతావరణాన్ని నెలకొల్పాలి. విశాలమైన అంతర్గత రోడ్లు, పలురకాల పూల మొక్కలతో విశాలమైన పచ్చిక బయళ్లను ఏర్పాటు చేసుకోవాలి. పార్లమెంటు రాష్ట్రపతి భవన్ సమీపంలో వున్న మాదిరి ధోల్ పూర్ స్టోన్ తో తీర్చిదిద్దిన ఫౌంటేన్లను నిర్మించుకోవాలి. అన్ని హంగులతో తెలంగాణ సచివాలయాన్ని గొప్పగా తీర్చిదిద్దాలి’’ అని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రోడ్లు భవనాల శాఖ, ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ, ఇఎన్సీ గణపతి రెడ్డి, ప్రభుత్వ వాస్తు సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, సచివాలయ వర్క్ ఏజెన్సీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + 2 =