కరోనా కేసుల నియంత్రణపై తెలంగాణ హైకోర్టులో విచారణ

Control of Corona Virus Cases, Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, High Court Hearing on Control of Corona Virus Cases, Mango News, telangana, Telangana Coronavirus, Telangana Coronavirus Cases, Telangana Coronavirus Deaths, Telangana Coronavirus New Cases, Telangana Coronavirus News, Telangana High Court, Telangana High Court Hearing on Control of Corona Virus Cases, Telangana New Positive Cases, Total COVID 19 Cases

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు విచారణ జరుపుతోంది. దీనిలో భాగంగా.. ఈ రోజు జరిగిన కరోనా కేసుల నియంత్రణపై విచారణలో కోర్ట్ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది. ఈ నెల 31 నుంచి స్కూళ్లను తెరుస్తున్నారా? అని హైకోర్టు ప్రశ్నించింది. అయితే, దీనిపై స్పందించిన ప్రభత్వం.. రాష్ట్రంలో పాఠశాలల పున:ప్రారంభంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తెలియజేసింది. వారాంతపు సంతల్లో కరోనా కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ సర్కారును ఆదేశించింది. సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్లకు సంబంధించిన నివేదికను కూడా కోర్టుకు సమర్పించాలని ఆదేశాలిచ్చింది.

తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఆన్ లైన్ లో విచారణకు హాజరయ్యారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 77 లక్షల ఇళ్లలో ఫీవర్ సర్వేలో 3.45 లక్షల మెడికల్ కిట్లను పంపిణీ చేశామని హైకోర్టుకు నివేదించారు. పాజిటివిటీ రేటు 3.16 శాతంగా ఉందన్నారు. పిల్లలకు సంబంధించిన మందులను కిట్లలో నేరుగా ఇవ్వడానికి లేదని కోర్టుకు విన్నవించారు. దీనిపై స్పందించిన హైకోర్టు, హెల్త్ డైరెక్టర్ ప్రస్తావించిన విషయాలకు సంబంధించి పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 3కి వాయిదా వేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − thirteen =