పట్టభద్రుల ఓటు నమోదు గడువు పెంపుపై ఈసీకి హైకోర్టు ఆదేశాలు

Telangana High Court Orders EC to Extend the Date of Graduate Voters Enrollment

తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఓటు నమోదు గడువు పెంచాలని ఎన్నికల కమిషన్‌ (ఈసీ) కు శుక్రవారం నాడు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో డిసెంబరు 1 నుంచి 31 వరకు ఓటు నమోదుకు అవకాశం కల్పిస్తామని ఈసీ కోర్టుకు తెలియజేసింది. ఇందుకు సంబంధించి కొత్తగా మరో నోటిఫికేషన్‌ జారీచేస్తామని ఈసీ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం-నల్లగొండ-వరంగల్‌ స్థానం మరియు హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు పదవీకాలం ముగియడంతో త్వరలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

దీంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 1 నుంచి ఓటర్ల నమోదు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ ప్రక్రియకు ముందుగా నవంబర్‌ 6 ను చివరి తేదీగా నిర్ణయించారు. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో గడువును డిసెంబరు 7 వరకు గడువు పెంచాలని న్యాయవాది రమేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు ఈ రోజు విచారణ చేపట్టి గడువు పెంపుకు ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో గడువు పెంచేందుకు ఈసీ నిర్ణయించింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 3 =