మద్యం తాగి నడిపిన వారి వాహనాల సీజ్‌ పై హైకోర్టు కీల‌క ఆదేశాలు

Don’t seize vehicles of drunk drivers, Drunk Driving Cases, High Court Orders Police Officials Not to Seize Vehicles in Drunk Driving Cases, Mango News, Police can not seize vehicles in drunk driving cases, Police cannot seize vehicles in drunk driving cases, Police have no authority to seize vehicles, Police have no power to seize vehicles in drunk driving cases, Telangana High Court, Telangana High Court Orders Police Officials Not to Seize Vehicles, Telangana High Court Orders Police Officials Not to Seize Vehicles in Drunk Driving Cases

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో వాహ‌నాల జ‌ప్తుపై తెలంగాణ హైకోర్టు శుక్రవారం నాడు కీల‌క ఆదేశాలు జారీ చేసింది. మద్యం తాగి నడిపిన వారి వాహనాలను సీజ్‌ చేసే అధికారం పోలీసు అధికారులకు లేదని హైకోర్టు తెలిపింది. మద్యం తాగిన వ్యక్తులకు మాత్రం వాహనం నడిపేందుకు అనుమతి ఇవ్వవద్దని కోర్టు పేర్కొంది. డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ సందర్భంగా ఆ వాహనంలో మద్యం తాగని మరో వ్యక్తి వెంట ఉంటే అతనికి వాహనం అప్పగించాలని సూచించింది.

అలాగే మద్యం తాగి పట్టుబడ్డ వ్యక్తి వెంట ఎవరూ లేకపోతే, సన్నిహితులను పిలిపించి వాహనాన్ని అప్పగించాలని, ఒకవేళ ఎవరూ రాకపోతే వాహనాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించి తర్వాత వారికీ అందించాలని కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలు అమలు చేయని పోలీసులపై కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవని చెప్పారు. మరోవైపు ప్రాసిక్యూషన్‌ అవసరమైన కేసుల్లో 3 రోజుల్లో ఛార్జిషీట్‌ వేసి, ప్రాసిక్యూషన్‌ పూర్తయిన వెంటనే వాహనాన్ని అప్పగించాలని తెలిపింది. ఇక వాహనాన్ని తీసుకునేందుకు ఎవరూ రాకపోతే చట్టప్రకారం చర్యలు చేపట్టాలని కోర్టు సూచించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 10 =