తెలంగాణ సాయుధ రైతాంగ సమరయోధుడు రావి నారాయణ రెడ్డికి సీఎం కేసీఆర్ నివాళి

CM KCR, CM KCR Paid Tributes to Telangana Armed Struggle Leader Ravi Narayan Reddy, CM KCR Paid Tributes to Telangana Armed Struggle Leader Ravi Narayan Reddy on his Birth Anniversary, KCR Paid Tributes to Ravi Narayan Reddy, KCR Paid Tributes to Telangana Armed Struggle Leader, Mango News, Ravi Narayan Reddy Birth Anniversary, Telangana Armed Struggle Leader, Telangana Armed Struggle Leader Ravi Narayan Reddy, Telangana Armed Struggle Leader Ravi Narayan Reddy Birth Anniversary, Telangana CM KCR

తెలంగాణ సాయుధ రైతాంగ సమరయోధుడు, ప్రజాస్వామికవాది రావి నారాయణ రెడ్డి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆయనకు ఘన నివాళులర్పించారు. తెలంగాణ విముక్తి కోసం పోరాటాలు నిర్మించిన రావి నారాయణ రెడ్డి, పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థ పట్ల కూడా ప్రదర్శించిన సానుకూల స్ఫూర్తి, గొప్పదని సీఎం స్మరించుకున్నారు.

‘స్వాతంత్య్రం వచ్చినంక దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామిక పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సాయుధ పోరాటాన్ని విరమించిన గొప్ప ప్రజాస్వామిక వాది రావి’ అని సీఎం తెలిపారు. దేశంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక ఓట్లతో విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించినారని సీఎం అన్నారు. ప్రజా పోరాటాలు విజయవంతం కావాలంటే నిర్దిష్ట పరిస్థితులకు, నిర్దిష్ట కార్యాచరణను అనుసరించాలనే సూత్రాన్ని రావి నారాయణ రెడ్డి ఆచరించి చూపారన్నారు. ఆయన అందించిన ప్రజాస్వామిక స్ఫూర్తి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాము అనుసరించిన పార్లమెంటరీ పోరాట పంథాలో ఇమిడివున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 1 =