తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ రద్దు, 1.47 లక్షల మంది విద్యార్థులు పాస్

Intermediate Advanced Supplementary Exams Cancelled, Intermediate Supplementary Exams 2020 Cancelled, Intermediate Supplementary Exams Cancelled, telangana, Telangana Inter Supply Exams Cancelled, Telangana Intermediate, Telangana Intermediate Advanced Supplementary Exams, Telangana Intermediate Supplementary Exams

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి వెల్లడించారు. కరోనా నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకొని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఈ పరీక్షలను రద్దు చేసినట్లు మంత్రి వివరించారు. మార్చి, 2020లో జరిగిన ద్వితీయ సంవత్సర పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులందరినీ పాస్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఉత్తీర్ణత పొందిన వారు కంపార్ట్మెంటల్ లో ఉతీర్ణులైనట్లుగా మార్కుల జాబితాలో పేర్కొనడం జరుగుతుందని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మొత్తం 1.47 లక్షల మంది విద్యార్థులు ప్రయోజనం పొందనున్నట్లు మంత్రి తెలిపారు. ఇందుకు సంబంధించిన మార్కుల మెమోలను జూలై 31వ తేదీ తర్వాత సంబంధిత కళాశాలల్లో పొందవచ్చని తెలిపారు. అయితే మార్కుల రీ కౌంటింగ్, రీ వేరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ఫలితాలను 10 రోజుల తర్వాత అందజేస్తామని మంత్రి సబితాఇంద్రారెడ్డి వివరించారు.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 3 =