తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్‌ ప్రాక్టికల్స్ పరీక్షలు వాయిదా

Intermediate Practical Examinations, Intermediate Practical Examinations Postponed, Intermediate practical exams, Mango News, telangana, Telangana Intermediate Practical Examinations, Telangana Intermediate Practical Examinations Postponed, Telangana Intermediate Practical Examinations Postponed Once Again, Telangana State Board of Intermediate Education, TS Inter 2nd year practical exams, TS Inter 2nd year practical exams postponed, TS Inter practical exam 2021 postponed, TS Inter Practical Exam 2021 Postponed due to COVID, TS Inter practical exam postponed, TS Inter practical exams 2021 postponed

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. ప్రస్తుత కరోనా మహమ్మారి పరిస్థితులు, రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు దృష్ట్యా మే 29 నుంచి జూన్‌ 7వ తేదీవరకు జరగాల్సిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం (జనరల్), ప్రథమ, ద్వితీయ సంవత్సరం (ఒకేషనల్) విద్యార్థుల ప్రాక్టికల్‌ పరీక్షలను తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు వాయిదా వేస్తున్నామని ప్రకటించారు. జూన్ మొదటి వారంలో పరీక్షల నిర్వహణపై సమీక్ష నిర్వహించి తేదీలను ప్రకటిస్తామని, అయితే ప్రాక్టికల్‌ పరీక్షలకు నిర్వహించే తేదికి కనీసం 15 రోజుల ముందే విద్యార్థులకు వివరాలు తెలియజేస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు సెక్రెటరీ సయ్యద్ ఒమర్ జలీల్ ఒక ప్రకటన విడుదల చేశారు.

ముందుగా షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 7వ తేదీ నుంచి ఏప్రిల్ 20వ తేదీవరకు ఇంటర్ ప్రాక్టికల్‌ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే కరోనా పరిస్థితుల దృష్ట్యా వాయిదావేసి మే 29 నుంచి జూన్‌ 7 వరకు నిర్వహించనున్నట్టు తెలంగాణ ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కొనసాగుతుండడంతో మరోసారి ప్రాక్టికల్స్‌ పరీక్షలను వాయిదా వేస్తూ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 1 =