రాష్ట్రపతి భవన్‌లో అర్జున అవార్డుల ప్రదానోత్సవం.. కోచ్‌లను, క్రీడాకారులను సత్కరించిన రాష్ట్రపతి ముర్ము

National Sports and Adventure Awards 2022 President Droupadi Murmu Presents Awards For Nominated Players and Coaches,Arjuna awards ceremony,Arjuna awards at Rashtrapati Bhavan,Rashtrapati Bhavan,President Murmu honored coaches, President Murmu honored players,Mango News,Mango News Telugu,National Sports Awards,National Adventure Awards,President Droupadi Murmu,Awards For Nominated Players,Awards For Coaches,National Sports Day 2022

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో అర్జున అవార్డుల కార్యక్రమం ఘనంగా జరిగింది. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో 25 మంది క్రీడాకారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ‘అర్జున’ అవార్డులను ప్రదానం చేశారు. ఏడుగురు కోచ్‌లకు ‘ద్రోణాచార్య’ అవార్డులు అందించారు. అలాగే మరో నలుగురు ఆటగాళ్లకు ‘ధ్యాన్‌చంద్‌’ అవార్డు ఇచ్చి సత్కరించారు. తెలంగాణకు చెందిన మహిళా బాక్సర్ నిఖత్ జరీన్, రెజ్లర్ అన్షు మాలిక్‌తో పాటు పలువురు క్రీడాకారులను రాష్ట్రపతి ‘అర్జున’ అవార్డుతో సత్కరించారు. మరో తెలుగు క్రీడాకారిణి శ్రీజ ఆకుల టేబుల్ టెన్నిస్ విభాగంలో, చదరంగంలో అద్భుతాలు సృష్టిస్తున్న ఆర్ ప్రజ్ఞానంద తదితరులు అవార్డులు అందుకున్నవారిలో ఉన్నారు. అలాగే టేబుల్ టెన్నిస్ ఆటగాడు ఆచంట శరత్ కమల్‌ మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డు అందుకున్నారు. కాగా ఈ సారి అర్జున అవార్డులకు ఎంపికైన వారిలో కామన్వెల్త్‌ గ్రేమ్స్‌-2022లో పాల్గొని భారత్‌కు పతకాలు అందించిన క్రీడాకారులు ఉండటం విశేషం. అర్జున అవార్డుతో సత్కరించిన ఆటగాళ్లందరికీ ఒక్కొక్కరికి రూ.15 లక్షలు అందజేస్తారు.

అర్జున అవార్డు అందుకున్న క్రీడాకారులు..

  • సీమా పునియా – అథ్లెటిక్స్
  • ఎల్దోస్ పాల్ – అథ్లెటిక్స్
  • అవినాష్ ముకుంద్ సేబుల్ – అథ్లెటిక్స్
  • లక్ష్య సేన్ – బ్యాడ్మింటన్
  • ప్రణయ్ – బ్యాడ్మింటన్
  • అమిత్ – బాక్సింగ్
  • నిఖత్ జరీన్ – బాక్సింగ్
  • భక్తి ప్రదీప్ కులకర్ణి – చెస్
  • ఆర్ ప్రజ్ఞానంద – చెస్
  • డీప్ గ్రేస్ ఎక్కా – హాకీ
  • శుశీలా దేవి – జూడో
  • సాక్షి కుమారి – కబడ్డీ
  • నయన్ మోని సైకియా – లాన్ బౌల్
  • సాగర్ కైలాస్ ఓవల్కర్ – మల్లాఖంబ్
  • ఎలవెనిల్ వలరివన్ – షూటింగ్
  • ఓంప్రకాష్ మిథర్వాల్ – షూటింగ్
  • శ్రీజ ఆకుల – టేబుల్ టెన్నిస్
  • వికాస్ ఠాకూర్ – వెయిట్ లిఫ్టింగ్
  • అన్షు – రెజ్లింగ్
  • సరిత – రెజ్లింగ్
  • పర్వీన్ – వుషు
  • మానసి గిరీశ్చంద్ర జోషి – పారా బ్యాడ్మింటన్
  • తరుణ్ ధిల్లాన్ – పారా బ్యాడ్మింటన్
  • స్వప్నిల్ సంజయ్ పాటిల్ – పారా స్విమ్మింగ్
  • జెర్లిన్ అనికా – పారా బ్యాడ్మింటన్

‘ద్రోణాచార్య’ అవార్డు అందుకున్న కోచ్‌లు..

  • జీవన్‌జోత్ సింగ్ తేజ – ఆర్చరీ
  • మహ్మద్ అలీ కమర్ – బాక్సింగ్
  • సుమ సిద్ధార్థ్ శిరూర్ – పారా షూటింగ్
  • సుజీత్ మాన్ – రెజ్లింగ్

జీవిన సాఫల్య పురస్కారాలు అందుకున్నవారు..

  • దినేష్ జవహర్ లాడ్ – క్రికెట్
  • బిమల్ ప్రఫుల్ల ఘోష్ – ఫుట్‌బాల్
  • రాజ్ సింగ్ – రెజ్లింగ్

ధ్యాన్ చంద్ అవార్డు అందుకున్నవారు..

  • అశ్విని అక్కుంజి సి – అథ్లెటిక్స్
  • ధరమ్‌వీర్ సింగ్ – హాకీ
  • బి సి సురేష్ – కబడ్డీ
  • నిర్ బహదూర్ గురుంగ్ – పారా అథ్లెటిక్స్

రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ గ్రహీత..

ట్రాన్స్‌స్టాడియా ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ, లడఖ్ స్కీ అండ్ స్నోబోర్డ్ అసోసియేషన్.

మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ గ్రహీత..

గురునానక్ దేవ్ యూనివర్సిటీ, అమృత్‌సర్.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − six =