డీసీసీబీల ద్వారా మెరుగైన సేవలకోసం ఒక ప్రత్యేక యాప్ ను రూపొందించాలి: సీఎస్

Chief Secretary Somesh Kumar, CS Somesh Kumar Held A Meeting, CS Somesh Kumar Latest News, CS Somesh Kumar Meeting, CS Somesh Kumar Meeting With NABARD, High Level Committee Meeting of NABARD, Mango News, NABARD, National Bank for Agriculture and Rural Development, Somesh Kumar, Telangana CS, Telangana CS Somesh Kumar

రాష్ట్రంలో డీసీసీబీలతో రైతులకు మరింత మెరుగైన సేవలు అందించడంతో పాటు ఆర్ధిక సామర్ధ్యాన్ని మెరుగుపరచడం కోసం డీసీసీబీ సభ్యులకు వర్క్ షాపు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం నాడు బిఆర్కెఆర్ భవన్ లో సీఎస్ సోమేశ్ కుమార్ అధ్యక్షతన నాబార్డ్ మొదటి హైలెవల్ కమిటి సమావేశం జరిగింది. టెస్కాబ్ (తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంకు) ద్వారా 795 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను కంప్యూటరీకరించి తెలంగాణ రాష్ట్రం దేశంలో మొదటి స్ధానంలో నిలిచినందుకు సీఎస్ అధికారులను అభినందించారు.

ప్రత్యేక యాప్ ను రూపొందించాలి:

డీసీసీబీ బ్రాంచీల ద్వారా మెరుగైన సేవలకోసం ఒక ప్రత్యేక యాప్ ను రూపొందించాలని, డీసీసీబీల పటిష్టతకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో కోఆపరేటివ్ సిస్టం పటిష్ఠత కోసం హైలెవల్ కమిటి సమర్పించిన నివేదికపై బ్రీఫ్ రిపోర్ట్ ను తయారుచేయాలని సలహా ఇచ్చారు. రాష్ట్రంలో కొత్త బ్రాంచీల ఏర్పాటు కోసం ఫిజిబిలిటి స్టడీ నిర్వహించాలని, అన్ని గ్రామాలలో సేవలు అందించేలా లక్ష్యం ఉండాలన్నారు. ఈ రిపోర్టును ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అనుమతి కోసం సమర్పించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, టెస్కాబ్ ‌ప్రెసిడెంట్ కె.రవీందర్ రావు, కో-ఆపరేటివ్‌ సొసైటీల కమిషనర్, రిజిస్ట్రార్‌ యం.వీరబ్రహ్మయ్య, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రోస్, సిజియం, నాబార్డ్ వై.కె.రావు, జియం నాబార్డ్ జె.ఎస్ ఉపాధ్యాయ్, టెస్కాబ్‌ ఎండీ డా.ఎన్ మురళీధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 19 =