ఈసీని కలిసిన మాజీ ఎంపీ వినోద్‌ కుమార్‌ బృందం, టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చుతూ చేసిన తీర్మానం కాపీ అందజేత

Telangana Planning Commission VP Vinod Kumar Team Submits The Resolution Copy of TRS Renamed as BRS To EC Today, Telangana Planning Commission VP Vinod Kumar, Vinod Kumar Team Submits TRS Renamed as BRS To EC, TRS Renamed as BRS, Mango News, Mango News Telugu, KCR National Party , TRS Party Live News And Updates, KCR New Party, BRS Party , TRS as Bharat Rashtra Samithi, TRS Name Changes To BRS, TRS Party, BRS Party Latest News And Live Updates, BRS Party Chief KCR, KCR, KTR, Kavitha Kalavakuntla

తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ బృందం గురువారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసింది. ఈ సందర్భంగా బుధవారం టీఆర్‌ఎస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశం (జనరల్‌ బాడీ మీటింగ్)లో తీసుకున్న కీలక నిర్ణయాన్ని కమిషన్ సభ్యులకు తెలిపింది. సీఎం కేసీఆర్ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) పేరును భారత రాష్ట్ర సమితిగా (టీఆర్‌ఎస్‌) మారుస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసిన విషయాన్ని ఈసీ దృష్టికి తెచ్చింది. అలాగే టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చుతూ చేసిన తీర్మానం కాపీని ఈసీకి అందజేసింది. దీనితో పాటుగా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ లేఖను కూడా జత చేసింది. ఈ క్రమంలో ‘భారత్ రాష్ట్ర సమితి’ పేరుని అధికారికంగా నమోదు చేయాలని వినోద్ కుమార్ బృందం కోరింది.

అనంతరం వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. సీఈసీ డిప్యూటీ కమిషనర్‌ ధర్మేంద్ర శర్మకు పార్టీ తీర్మానం కాపీని అందజేశామని, సీఈసీ తమ దరఖాస్తును పరిశీలించి త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 29ఎ ప్రకారం ఏదేని ఒక రాజకీయ పార్టీ తదనంతర కాలంలో పేరు మార్చుకోవచ్చునని ఆయన స్పష్టం చేశారు. దీనిని అనుసరించే టీఆర్‌ఎస్‌ పేరును బిఆర్‌ఎస్‌గా మార్చడం జరిగిందని వెల్లడించారు. ఇక దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా పార్టీ పేరు లేదా అడ్రస్‌ మార్చుకున్నప్పుడు కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేయాల్సి ఉంటుందని, అందుకే నిన్నటి సమావేశంలో పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని, దానికి సంబంధించిన తీర్మాన ప్రతిని ఈసీకి అందజేశామని వినోద్‌ కుమార్‌ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − 11 =