తెలంగాణలో ప్రైవేట్‌ టీచర్లకు, సిబ్బందికి నేటినుంచే రూ.2 వేలు నగదు పంపిణీ

KCR announces allowance and 25kg rice to private school teachers, Mango News, Private School Teachers and Staff to get Rs 2000, Rs 2000 25 kg rice for private teachers, Rs 2000 25 kg rice for private teachers In Telangana, Staff of closed private schools in Telangana, Telangana CM announces Rs 2000 25 kg rice for private teachers, Telangana Private School Teachers and Staff to get Rs 2000, Telangana Private School Teachers and Staff to get Rs 2000 Financial Assistance, Telangana Private School Teachers and Staff to get Rs 2000 Financial Assistance From Today, Telangana Private Teachers, TS Guidelines for Private Teachers Rs 2000 Financial Assistance

కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయడంతో గుర్తింపు పొందిన ప్రైవేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి నెలకు రూ.2000 ఆపత్కాల ఆర్ధిక సాయంతో పాటు కుటుంబానికి 25 కేజీల బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా ​ప్రైవేటు పాఠశాలల్లో పని‌చే‌స్తున్న 1,24,704 మంది టీచర్లు, సిబ్బందిని ఈ సహాయం పొందేందుకు అర్హులుగా ఎంపిక చేశారు.

ఇక టీచర్లు, సిబ్బం‌దికి ప్రభుత్వం అందించే రూ.2 వేల ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమం నేటి నుంచే (ఏప్రిల్ 20, మంగళవారం) ప్రారంభం కాగా, ఏప్రిల్ 24వ తేదీ‌వ‌రకు లబ్ధి‌దా‌రుల ఖాతాల్లో నగ‌దును జమ చేయనున్నారు. ఇందుకోసం ఏప్రిల్ 2021 నెలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్లను విడుదల చేసింది. మరోవైపు ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 25 వరకు ఎంపిక చేసిన లబ్ధిదారులందరికీ రేషన్‌ దుకాణాల ద్వారా 25 కిలోల బియ్యం కూడా అందజేయనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 4 =