తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదయ్యాయి. కొత్తగా 1498 కేసులు నమోదవడంతో ఏప్రిల్ 5, సోమవారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,14,735 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వలన మరో ఆరుగురు మరణించడంతో, రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 1729 కి పెరిగింది. ఇక గత 24 గంటల్లో 245 మంది కరోనా నుంచి కోలుకోగా, రికవరీ అయినవారి సంఖ్య 3,03,013 కు చేరుకుంది. ప్రస్తుతం 9,993 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు సోమవారం నాడు 62,350 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 1,04,98,347 కు చేరగా, రాష్ట్రంలో ప్రతి పదిలక్షల జనాభాకు 2,82,061 పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ