కారెక్కనున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అంటూ వార్తలు..

Telangana Sangareddy MLA Jagga Reddy Likely Quits Congress Party Soon,Telangana Sangareddy MLA Jagga Reddy,Jagga Reddy Likely Quits Congress Party Soon,Sangareddy MLA Jagga Reddy,Mango News,Mango News Telugu,Congress MLA Jaggareddy, Congress leader, former MP Ponguleti Srinivas Reddy, Khammam ,Tellam Venkatarao ting Bhadrachalam ticket, Former minister Chandrasekhar, BJP, Congress,Jaggareddy is looking towards BRS,Telangana Sangareddy MLA Latest News,Telangana Sangareddy MLA Latest Updates,MLA Jagga Reddy News Today,MLA Jagga Reddy Latest News,MLA Jagga Reddy Latest Updates

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్ది రాజకీయ పరిణామాలు వేగంగా మారుతోన్నాయి. నేతలు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు గోడలు దూకుతున్నారు. ఖమ్మంలో కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అనుచరుడు తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్‌లో చేరారు. ఆయన భద్రాచలం టికెట్ ఆశిస్తున్నట్లు తెలిసింది. మాజీ మంత్రి చంద్రశేఖర్ కొద్ది రోజుల క్రితం బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పటి వరకు పార్టీలు మారుతున్న వారిలో మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు.

అయితే.. తాజాగా కాంగ్రెస్ చెందిన ఓ ఎమ్మెల్యే బీఆర్ఎస్ వైపు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యవహారశైలి ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. ఆయన కారు ఎక్కెందుకు రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. జగ్గారెడ్డి కొంతకాలంగా గులాబీ పార్టీ నేతలతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన బీఆర్ఎస్‌లో చేరి సంగారెడ్డి నుంచే పోటీ చేయనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

పార్టీ మార్పుపై జగ్గారెడ్డి ఇంకా స్పందించలేదు. పార్టీ మార్పుపై వస్తున్న వార్తలను ఖండించకపోవడంతో ఆయన పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన నుంచి జగ్గారెడ్డి కాస్త అసంతృప్తిగా ఉన్నారు. పలు సందర్భాల్లో రేవంత్ రెడ్డిని టార్గెట్‌ చేస్తూఏ జగ్గారెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ అధిష్ఠానికి కూడా లేఖలు రాశారు.

మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జగ్గారెడ్డి.. కేటీఆర్‌ను కలిసిన వీడియో ఒకటి బయటికొచ్చింది. కేటీఆర్‌ను కలిసినప్పుడు జగ్గారెడ్డితో టీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌ ఉన్నారు. మీ ఇద్దరి దోస్తాన్‌ ఎక్కడ కుదిరిందని కేటీఆర్‌ అడగ్గా.. మాది ఒకే మంచం, ఒకే కంచం అంటూ మామిళ్ల చెప్పారు. అట్లయితే జగ్గారెడ్డిని గెలిపిస్తావా అని కేటీఆర్ అడగ్గా.. సంగారెడ్డిలో గెలిపించి బీఆర్ఎస్‌లోకి తీసుకొస్తానని మామిళ్ల రాజేందర్ సరదాగా అన్నారు. కానీ ఇప్పుడు అదే నిజమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే జగ్గారెడ్డి కాంగ్రెస్‌ చేపడుతున్న పలు కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + 6 =