తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలపై దేశ, విదేశీ పర్యాటకుల ఆసక్తి, ఎనిమిదేళ్లలో ఎంతమంది వచ్చారంటే?

Telangana Tourism Sector Statistics Details of both Domestic and Foreign Visitors from 2014,Interest Of National And Foreign Tourists, Tourist Areas Of Telangana, How Many Have Come In Eight Years,Mango News,Mango News Telugu,Telangana Tourism Sector,Statistics Details,Domestic and Foreign Visitors,Domestic Visitors 2014,Foreign Visitors 2014,Telangana Tourism,Telangana Tourism 2023,Telangana Tourism Latest News And Updates,Telangana Tourism News And Live Updates

తెలంగాణ రాష్ట్రంలో “మన తెలంగాణ-మన సంస్కృతి-మన పర్యాటకం” అనే ఆశయంతో పర్యాటక రంగం అభివృద్ధికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలకు దేశ, విదేశీ సందర్శకుల రాక పెరిగిందని తెలిపారు. 2014 నుండి 2022 జులై వరకు రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను 63.51 కోట్ల మంది డోమెస్టిక్ టూరిస్టులు సందర్శించారని, అలాగే 2014 నుండి తెలంగాణను సందర్శించిన విదేశీ పర్యాటకుల సంఖ్య 13 లక్షల 50 వేల 307గా ఉందని తెలిపారు. ఈ మేరకు తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది.

“తెలంగాణ కోటి రతనాల వీణ…దక్కన్ పీఠభూమిలో ప్రకృతి రమనీయత, సహజ జలవనరులు, తటాకాలు, కొండలు, కోనలు, కోటలు, ఆధ్యాత్మిక ప్రాంతాలకు నిలయంగా నిలిచింది. ఇన్ని వైవిద్యమైన ప్రదేశాలు ఉన్న తెలంగాణ ప్రాంత పర్యాటక రంగం ఉమ్మడి పాలనలో నిర్లక్ష్యంకు గురయింది. కనీసం ప్రచారానికి కూడా నోచుకోలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో తెలంగాణ పర్యాటక రంగానికి నూతన జవసత్వాలు సంతరించుకుంటున్నాయి. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, సహజ వనరులు, అభివృద్ధి పట్ల సంపూర్ణ అవగాహన ఉన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలంగాణను టూరిజం డెస్టినేషన్ గా తీర్చిదిద్దుతున్నారు. రాష్ట్ర పర్యాటక రంగమును అభివృద్ధి చేసి, తగు ప్రాచుర్యం కల్పించి ప్రోత్సహించుటకు తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్టీడీసీ) ని నోడల్ ఏజెన్సీగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సంస్థ రాష్ట్రవ్యాప్తంగా 54 హరిత టూరిజం హోటల్స్, వే సైడ్ వసతులను కల్పించింది. పర్యాటక రంగంమునకు అనువైన ప్రాంతాల్లో వసతులను అభివృద్ధి చేస్తున్నది. 31 టూరిజం బస్సులు, 120 బోట్స్ నడుపుతున్నది. గోల్కొండ, వరంగల్ కోటల వద్ద సౌండ్ అండ్ లైట్ షోలను నిర్వహిస్తున్నది. ఇంగ్లీష్, హిందీ, తెలుగు భాషల్లో డ్రామాటిక్ గా ఈ కోటల కథనాలను గాత్రాలు, సంగీతం, లైట్ ఎఫెక్ట్ తో ప్రదర్శిస్తున్నారు” అని తెలిపారు.

“రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న వసతులతో తెలంగాణ పట్ల దేశ, విదేశీ పర్యాటకుల ఆసక్తి పెరిగింది. డోమెస్టిక్ టూరిజం గణనీయంగా వృద్ధి చెందింది. 2014 నుండి 2022 జూలై వరకు తెలంగాణను 63 కోట్ల 51 లక్షల మంది డోమెస్టిక్ టూరిస్టులు సందర్శించారు. అలాగే 13 లక్షల 50 వేల 307 మంది విదేశి టూరిస్టులు తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. ప్రభుత్వం చేపట్టిన పనులతో పోచంపల్లికి ఉత్తమ పర్యాటక గ్రామంగా ప్రపంచ పర్యాటక సంస్థ నుంచి గుర్తింపు లభించింది. నాగార్జున సాగర్ వద్ద రూ.65 కోట్లతో బుద్ధవనం ప్రాజెక్ట్ ను అభివృద్ధి చేసింది. ములుగు జిల్లా మేడారం గ్రామంలో ఉన్న సమ్మక్క-సారలమ్మ జాతరకు రూ.13.43 కోట్లతో పర్యాటక వసతులను రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది” అని చెప్పారు.

“అలాగే లక్నవరం వద్ద రూ.27.65 కోట్లతో అదనపు వసతులు కల్పించింది. తాడ్వాయిలో రూ.9.36 కోట్లు, గట్టమ్మ గుట్ట వద్ద రూ.7.36 కోట్లు, మల్లూరు వద్ద రూ.4.20 కోట్లు, బొగత వాటర్ ఫాల్స్ వద్ద రూ.11.64 కోట్లు, సోమశిల రిజర్వాయర్ వద్ద రూ.20.87 కోట్లు, సింగోటం రిజర్వాయర్ వద్ద రూ.7.84 కోట్లు, శ్రీశైలం ఈగలపెంట వద్ద రూ.25.96 కోట్లు, ఫర్హాబాద్ మన్ననూరు వద్ద రూ.13.81 కోట్లు, మల్లెల తీర్ధం వద్ద రూ.5.35 కోట్లు, అక్క మహాదేవి గుహలు వద్ద రూ.1.25 కోట్లతో కల్పించిన పర్యాటక వసతులను ప్రజలకు అందుబాటులో ఉంచింది. వీటితో పాటు కోట్లాది రూపాయల వ్యయంతో హరిత పేరున పర్యాటక హోటల్స్ ను నిర్మించింది. ఆధునిక వసతులున్న వాటర్ ఫ్లీట్ బోట్స్, ఏ. సి, వొళ్వో బస్సులను నసుపుతున్నది.అనేక చారిత్రక కట్టడాలను పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దుతున్నది. వీటితో పాటు అన్ని జిల్లాలలోని పర్యాటక ప్రాంతాల్లో వసతులు అభివృద్ధి చేసి అంతర్గత పర్యాటకాన్ని ప్రోత్సాహిస్తున్నది. కోవిడ్ అనంతరం డోమెస్టిక్ తో పాటు విధేశీ పర్యాటకుల సంఖ్య పెరుగుతున్నది. తెలంగాణ పర్యాటక ప్రాంతాలు సందర్శకులతో కళకళ లాడుతున్నాయి. దీనితో వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తున్నది” అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × three =