మహిళల సమస్యలు తక్షణమే పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలి, కమిషన్ లో కేసులపై సునీతా లక్ష్మారెడ్డి సమీక్ష

Telangana Women Commission Chairperson Sunitha Lakshmareddy held Review on Cases Reported in Commission,Telangana Women Commission,Chairperson Sunitha Lakshmareddy,Cases Reported in Commission,Mango News,Mango News Telugu,Sunitha Lakshmareddy, Sunitha Lakshmareddy Women Commission Chairperson,Sunitha Lakshmareddy Latest News And Updates,Telangana Women Commission Chairperson,Telangana State Women's Commission,Women's Commission Appointed, Women's Commission for Telangana

మహిళలు ఎదుర్కొనే న్యాయపరమైన సమస్యలు పరిష్కరించడంలో తెలంగాణ మహిళా కమిషన్ ముందుండాలని కమిషన్ ఛైర్ పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి కమిషన్ సభ్యులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని మహిళా కమిషన్ కార్యాలయంలో జరిగిన సర్వ సభ్య సమావేశానికి ఛైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు షహీన్ అఫ్రోజ్, కొమ్ము ఉమాదేవి యాదవ్, గద్దల పద్మ, సుధాం లక్ష్మి, కటారి రేవతి రావు, కమిషన్ కార్యదర్శి కృష్ణ కుమారి మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఛైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ జిల్లాల వారీగా తరచూ సమావేశాలు నిర్వహించి మహిళా సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు వీలుగా అధికారులను సమన్వయపరచాలని సూచించారు. మహిళా కమిషన్ లో నమోదు అయ్యే కేసులపై శుక్రవారం కమిషన్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. సమస్యలు తక్షణమే పరిష్కారం అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.

కమిషన్ సిఫార్సుపై అయా ప్రభుత్వ శాఖలు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని, అలాగే ఎలాంటి చర్యలు తీసుకున్నారో మహిళా కమిషన్ కి వివరణ ఇవ్వాలని లేదంటే సంబంధిత అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇప్పటికే ఆ శాఖల వద్ద చాలా కేసులు పెండింగులో ఉన్నాయని తెలిపారు. ఆస్తుల వివాదాలు, కోర్టు కేసుల పట్ల మహిళలు సంబంధిత శాఖలను ఆశ్రయించాలని, అవి కమిషన్ పరిధిలోకి రావని సునీతా లక్ష్మారెడ్డి వెల్లడించారు. అత్యాచారానికి గురైన మహిళా బాధితులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న పరిహారం తక్షణమే విడుదలయ్యేలా చూడాలని అధికారులను కోరారు. సఖి సెంటర్లలో పెండింగ్ కేసులపై ఆరా తీసినా చైర్ పర్సన్ వాటిని సత్వారమే పరిష్కరించేలా చూడాలని సూచించారు.

మహిళలకు ఏ సమస్యా వచ్చిన తక్షణమే మహిళ కమీషన్ దృష్టికి తీసుకురావాలని కోరారు. సోషల్ మీడియా ద్వారా కూడా కంప్లైంట్ చేయవచ్చని గుర్తు చేసారు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ @SCWTelangana ద్వారా మరియు ఇమెయిల్ [email protected] మరియు హెల్ప్ లైన్ 181 లేదా కమిషన్ వాట్సప్ నంబర్ 9490555533 ద్వారా కూడా మహిళలకు జరిగే అన్యాయాన్ని కమిషన్ దృష్టికి తీసుకురావచ్చని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + 2 =