తెలంగాణ కాంగ్రెస్‌లో కుర్చీల కొట్లాట.. కాబోయే సీఎం ఎవరు?

The Fight of Chairs in Telangana Congress Who Will be the Future CM,The Fight of Chairs in Telangana Congress,Who Will be the Future CM,Mango News,Mango News Telugu,Congress in Telangana has many CM aspirants,Fear of Defeat or Clever Political Move,Telangana election 2023,Telangana polls,Key constituencies that will shape,Telangana Congress Latest News,Telangana Congress Latest Updates,Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates
congress, t.congress cm candidate, telangana assembly elections, revanth reddy, jaggareddy

తెలంగాణలో కాంగ్రెస్ తరుపున సీఎం అభ్యర్థి ఎవరు అంటే?.. ఏ ఒక్క నాయకుడికీ కూడా క్లారిటీ లేదు. పలు సర్వేల నివేదికలు అనుకూలంగా రావడంతో.. ఎమ్మెల్యేల నుంచి సీనియర్ల వరకు అంతా సీఎం కుర్చీపై కన్నేశారు. ఎవరికి వారు.. తానే కాబోయే సీఎం అంటే.. తానే కాబోయే సీఎం అని ప్రకటించుకుంటున్నారు. సీఎం అని పిలిపించుకోవాలని ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు సీనియర్ నేత జానారెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిలు.. కాంగ్రెస్ తరుపున కాబోయే ముఖ్యమంత్రి తామేనంటూ ప్రకటించేసుకున్నారు.

ఇలా సీఎం కుర్చీ కోసం కాంగ్రెస్ నేతలు కొట్లాడు కోవడంపై ఇప్పటికే మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. కాంగ్రెస్‌కు ముఖ్యమంత్రులు దొరికారు కానీ.. ఓటర్లు దొరకడం లేదని విమర్శలు చేశారు. కాంగ్రెస్‌లో 11 మంది సీఎం కుర్చీ కోసం కొట్లాడుకుంటున్నారని చెప్పుకొచ్చారు. అటు ఎన్నికల్లో పోటీ చేయని.. జానారెడ్డి కూడా సీఎం కుర్చీ కోసం పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు.

అయితే ప్రత్యర్థి పార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ.. కాంగ్రెస్ నేతలు ఏ మాత్రం తగ్గడం లేదు. సీఎం కుర్చీ కోసం కొట్లాడుకుంటూనే ఉన్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా .. సీఎం కుర్చీపై తన మనసులోని మాట బయటపెట్టారు. తనకు ముఖ్యమంత్రి కావాలని లేదన్న వెంకటరెడ్డి.. ఏదో ఒక రోజు మాత్రం తప్పకుండా ముఖ్యమంత్రిని అవుతానని వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ది అంతా తన హయాంలోనే జరిగిందని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే.. ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని వెల్లడించారు.

అయితే పార్టీని అధికారంలోకి తీసుకురావడం పక్కనపెట్టి.. సీఎం కుర్చీ కోసం నేతలు పోట్లాడుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేతలు పదవుల ఆశతో విభేదాలు సృష్టించుకునే అవకాశం ఉందని పొలిటికల్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. ఎన్నికలకు ముందే నేతలు సీఎం కుర్చీ కోసం ఇంతలా పొట్లాడుకుంటే.. ఒకవేళ అధికారంలోకి వస్తే ఇంకా ఎంతలా పొట్లాడుకుంటారోనని జనాలు మాట్లాడుకుంటున్నారు. కర్ణాటకలో ఇద్దరు నేతలు మాత్రమే పోటీ పడ్డారు కాబట్టి.. ఇద్దరికి సర్ది చెప్పి చెరో రెండున్నరేళ్లు పదవిని కట్టబెట్టారు. మరి ఇక్కడ 10 మందికి పైగా నేతలు పోటీ పడుతున్నారు. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. వారిలో ఎవరికి అధిష్టానం సీఎం కుర్చీ కట్టబెడుతుందనేది చర్చనీయాంశంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + twenty =