దత్తపుత్రుడు, ఎల్లో మీడియా సపోర్ట్ నాకు అవసరం లేదు: జగన్

Adopted son I dont need yellow media support says CM Jagan,Adopted son I dont need yellow media,CM Jagan on yellow media, AP, chandrababu naidu, cm jagan, cm jagan comments,Mango News,Mango News Telugu,Yellow media will not question Chandrababu,Andhra Pradesh CM Jagan Mohan Reddy,CM Jagan Latest News,CM Jagan Latest Updates,AP Politics,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates
ap politics, ap, chandrababu naidu, cm jagan, cm jagan comments

ఏపీలో ఎన్నికలకు ఇంకా నాలుగైదు నెలల గడువు ఉంది. కానీ ఇప్పటి నుంచే అక్కడ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విమర్శలకు ప్రతివిమర్శలు.. సవాళ్లకు  ప్రతిసవాళ్లు చేసుకుంటూ రచ్చ చేస్తున్నారు. ఒకరి తప్పులను మరొకరు ఎండగడుతూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. ముఖ్యంగా చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇక టీడీపీ, ఆ పార్టీ నేతలంటేనే నిప్పులు చెరిగే సీఎం జగన్ మరోసారి చంద్రబాబు నాయుడుపై సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు ఏది ముట్టుకున్నా స్కాంలేనని వ్యాఖ్యానించారు.

 

చంద్రబాబుకు అధికారంలో ఉన్నప్పుడు స్కాంలు తప్ప స్కీమ్‌లు గుర్తుకు రాలేదని జగన్ ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం, ఫైబర్ గ్రిడ్ స్కాం, ఇసుక దందా, మద్యం దందా.. ఇలా అన్నీ స్కామ్‌లే జరిగియాని.. అభివృద్ధి మాత్రం శూన్యమని జగన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు దోచుకోవడం.. దాచుకోవడం తప్ప అభివృద్ధి చేయడం తెలియదని అన్నారు. ఏపీని దోచుకోవడానికి మాత్రమే చంద్రబాబుకు పదవి కావాలని.. ప్రజలకు సేవ చేసేందుకు కాదని అన్నారు. తన హయాంలో ఒక్కరోజు కూడా చంద్రబాబు పేదలు, ప్రజలు, వృద్ధుల గురించి ఆలోచించలేదని చెప్పుకొచ్చారు.

 

చంద్రబాబుకు దత్తపుత్రుడు.. ఎల్లో మీడియా సపోర్ట్ ఉందని.. తనకు ఏ సపోర్ట్ అవసరం లేదని జగన్ చెప్పారు. తనకు ప్రజలే అండగా ఉన్నారన్నారు. తనకు ప్రజలకు మంచి చేయడం మాత్రమే తెలుసని.. అబద్ధాలు చెప్పడం తెలియదని వెల్లడించారు.  తన వల్ల మంచి జరిగి ఉంటే.. సైనికుల్లా తన వెంట నిలబడాలని జగన్ జనాలను కోరారు. డబ్బులు, బంగారం ఇస్తామని కొందరు మధ్యపెడుతుంటారన్న జగన్.. వారి మాటలు అస్సలు నమ్మొద్దని సూచించారు. ప్రజల అండతో మరోసారి అధికారంలోకి వస్తామని జగన్ ధీమా వ్యక్తం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 7 =