టాలీవుడ్ హీరో మహేశ్‌ బాబు ఇంట విషాదం, తల్లి ఇందిరా దేవి కన్నుమూత

Tollywood Hero Mahesh Babu's Mother Indira Devi Passes Away Today, Tollywood Hero Mahesh Babu, Mahesh Mother Indira Devi Passes Away Today, Mahesh Mother Indira Devi, Indira Devi Passes Away Today, Tollywood Hero Mahesh Babu's Mother Indira Devi, Mango News, Mango News Telugu, Super Star Mahesh Babu, Indira Devi Passed Away, Mahesh Babu Mother Indira Devi, Mahesh Babu Latest News And Updates, Indira Devi, Namrata Shirodkar, Tollywood Latest News And Live Updates

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. టాలీవుడ్ హీరో మహేశ్‌ బాబుకు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి, ఒకప్పటి సూపర్‌స్టార్‌ ఘట్టమనేని కృష్ణ సతీమణి శ్రీమతి ఇందిరా దేవి కన్ను మూశారు. కాగా గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కృష్ణ-ఇందిరా దేవి దంపతులకు మొత్తం ఐదుగురు సంతానం. కుమారులు రమేష్ బాబు, మహేష్ బాబులతో పాటు కుమార్తెలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని ఉన్నారు. అయితే ఈ ఏడాది జనవరిలో పెద్ద కుమారుడు రమేష్‌ బాబు కూడా అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఇందిరా దేవి మృతితో, మహేశ్‌ బాబు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. కాగా ఇందిరా దేవి భౌతికకాయాన్ని ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు అభిమానుల సందర్శనార్థం పద్మాలయ స్టూడియోలో ఉంచనున్నారు. అనంతరం సాయంత్రం హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక ఇందిరా దేవి మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, ఘట్టమనేని అభిమానులు తమ సంతాపం తెలియజేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here