అనారోగ్య కారణాలతో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ మునుగోడు పాదయాత్రకు దూరం

TPCC Chief Revanth Reddy will Stay Away From Congress Party's Munugode Padayatra Due To Health Issues, Revanth Reddy will Stay Away From Congress Party's Munugode Padayatra Due To Health Issues, TPCC Chief will Stay Away From Congress Party's Munugode Padayatra Due To Health Issues, Congress Party's Munugode Padayatra, TPCC Chief Revanth Reddy Health Issues, Munugode Padayatra, TPCC Chief Revanth Reddy, TPCC Chief Revanth Reddy undergoes self-quarantine, Congress Party's Munugode Padayatra News, Congress Party's Munugode Padayatra Latest News And Updates, Congress Party's Munugode Padayatra Live Updates, Revanth Reddy, Mango News, Mango News Telugu,

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఆధ్వర్యంలోని నేటి మునుగోడు పాదయాత్రకు దూరం కానున్నారు. ఆయన ప్రస్తుతం జ్వరం మరియు స్వల్ప కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో కోవిడ్ నిర్ధారణ టెస్టుల కోసం నమూనాలను ల్యాబ్‌కు పంపించినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి తన ఇంట్లోనే సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. రిజల్ట్స్ వచ్చాక దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఇక ఈ పరిణామాల క్రమంలో నేటి పాదయాత్రకు ఆయన దూరంగా ఉండనున్నట్లు భావిస్తున్నారు.

కాగా మునుగోడు ఉప ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు పాదయాత్ర చేపట్టనున్న సంగతి తెలిసిందే. నారాయణపూర్ నుంచి చౌటుప్పల్ వరకు కాంగ్రెస్ పాదయాత్ర చేయనుండగా, యాత్రకు అన్ని ఏర్పాట్లు చేశామని కాంగ్రెస్ నాయకులు చెప్పారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డిపై ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పాదయాత్రకు రేవంత్ హాజరవడం ఇష్టం లేని ఆయన దీనిని పార్టీ రాష్ట్ర ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ పాదయాత్రలో పాల్గొనడానికి నిరాకరించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి శనివారం ఉదయం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here