కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి మరోసారి కరోనా పాజిటివ్

Congress President Sonia Gandhi Tests Positive for Covid-19 Again, Sonia Gandhi Tests Positive for Covid-19 Again, Positive for Covid-19, Coronavirus, Coronavirus LIVE Updates, Covid 19 Updates, COVID-19 Latest Updates, Positive For Coronavirus, Sonia Gandhi Corona Positive, Sonia Gandhi Coronavirus, Sonia Gandhi Covid 19, Sonia Gandhi Covid 19 Positive, Sonia Gandhi Covid News, Sonia Gandhi Covid Positive, Sonia Gandhi Health, Sonia Gandhi Health Condition, Sonia Gandhi Health News, Sonia Gandhi Health Reports, Sonia Gandhi Latest Health Condition, Sonia Gandhi Latest Health Report, Sonia Gandhi Latest News And Updates, Mango News, Mango News Telugu,

కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత, తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి మరోసారి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని పార్టీ ఎంపీ, కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జ్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. “కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఈరోజు కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారం ఆమె ఐసోలేషన్ లో ఉంటుంది” అని పేర్కొన్నారు. కాగా గత జూన్ లో కూడా సోనియా గాంధీ కరోనా బారినపడ్డారు. కొన్ని రోజులు పోస్ట్ కరోనా సమస్యలతో సోనియా గాంధీ ఆసుపత్రిలో చికిత్స కూడా తీసుకున్నారు. ఈ క్రమంలో ఆమెకు మరోసారి కరోనా సోకడంతో నాయకుల్లో, కార్యకర్తల్లో ఆందోళన నెలకుంది.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, కీలక నేత ప్రియాంకా గాంధీ వాద్రాకి కూడా ఆగస్టు 10న మరోసారి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గత జూన్ లో కూడా ప్రియాంకా గాంధీ కరోనా బారినపడి కోలుకున్న విషయం తెలిసిందే. ఇక దేశంలో కొత్తగా 15,815 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 4,42,39,372 కు చేరుకుంది. అలాగే కొత్తగా మరో 68 మరణాలు నమోదవడంతో మొత్తం మరణాల సంఖ్య 5,26,996 కి పెరిగింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here