అన్ని విభాగాల్లో ఉద్యోగ ఖాళీల వివరాలను 5 రోజుల్లోగా అందించాలి, తెలంగాణ కేబినెట్ ఆదేశం

Mango News, telangana, Telangana Cabinet, Telangana Cabinet 2021, Telangana cabinet announces recruitment calendar, Telangana Cabinet doesn’t make any headway on job, Telangana Cabinet Key Decisions, Telangana Cabinet Orders Officials to Submit Vacancies List, Telangana Cabinet Orders Officials to Submit Vacancies List In All Departments, Telangana Cabinet Orders Officials to Submit Vacancies List In All Departments within 5 Days, Telangana CM Issues Order to Fill 50000 Job Vacancies, Telangana Vacancies List In All Departments, Vacancies List In All Departments

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన బుధవారం నాడు ప్రగతి భవన్ లో రెండో రోజు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో ఉద్యోగాల నియామకాలపై కీలకంగా చర్చించారు. ముందుగా కేబినెట్ సమావేశానికి హాజరైన అన్ని శాఖల కార్యదర్శులు, వివిధ శాఖలలో ఉన్న ఉద్యోగుల వివరాలను ఖాళీల వివరాలను కేబినెట్ కు అందించారు. ప్రతి విభాగంలో మంజూరీ అయివున్న పోస్టుల సంఖ్యను, వివిధ కేటగిరీల్లో ఉన్న ఖాళీల వివరాలతో పాటు అందులో పనిచేస్తున్న కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వివరాలను కూడా కేబినెట్ ముందుంచారు. కొత్త జోనల్ వ్యవస్థ, కొత్త జిల్లాల ప్రకారంగా అన్ని రకాల ఉద్యోగుల విభజన జరగాలని, తద్వారా జిల్లాల వారీగా జోన్ల వారీగా అన్ని ఖాళీలను గుర్తించాలని, వాటితో పాటు ప్రమోషన్ల ద్వారా ఏర్పడే ఖాళీలను భర్తీ చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది.

అన్ని విభాగాల్లో ఉద్యోగ ఖాళీల వివరాలను 5 రోజుల్లోగా అందించాలి:

సమాజంలో, ఉద్యోగ రంగాల్లో చోటుచేసుకుంటున్న అధునాతన మార్పులకు అనుగుణంగా, వినూత్న రీతిలో ఉద్యోగాల కల్పన అవసరమని అందుకు సరికొత్త పోస్టుల అవసరం పడుతున్నదని కేబినెట్ అభిప్రాయపడింది. అదే సందర్భంలో కాలం చెల్లిన కొన్ని పోస్టుల అవసరం లేకుండా పోతున్నదని, కాలానుగుణంగా ఉద్యోగ వ్యవస్థలో కూడా మార్పులు చోటు చేసుకోవాలని సూచించింది. తద్వారా ప్రజలకు మరింత చేరువగా పాలనను తీసుకెళ్లి వారికి ప్రభుత్వ సేవలందించే వ్యవస్థను ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఏర్పాటు చేసుకోవాలని, ఆ దిశగా చర్యలకు పూనుకోవాలని అన్ని శాఖల కార్యదర్శులను, అధికారులను కేబినెట్ ఆదేశించింది.

రెండు రాష్ట్రాల నడుమ ఉద్యోగుల విభజన పూర్తయిందని, ఆంధ్రాలో మిగిలిన ఉద్యోగులను కూడా ఈ మధ్యనే తెలంగాణకు తెచ్చుకున్నామని కేబినెట్ తెలిపింది. ఇంకా కూడా మిగిలిపోయిన 200 నుంచి 300 తెలంగాణ ఉద్యోగులను ఆంధ్రా నుంచి తీసుకురాబోతున్నామని చెప్పారు. ఈ అన్ని సందర్భాలను దృష్టిలో ఉంచుకుని, ఆంధ్రా నుంచి వచ్చే ఉద్యోగులందరినీ కలుపుకుని ఇంకా మిగిలివున్న ఖాళీలను సత్వరమే గుర్తించి కేబినెట్ సబ్ కమిటీకి నివేదిక అందచేయాలని, కేబినెట్ అధికారులను ఆదేశించింది.
అన్ని ప్రభుత్వ సంస్థలకు చెందిన ఆస్తులను క్రోడీకరించి జిల్లా వారీగా, విభాగాల వారీగా సంకలనం చేయాలని కేబినెట్ ఆదేశించింది. ప్రస్థుత ఉద్యోగుల సంఖ్య, ఖాళీల సంఖ్యకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని, అన్ని విభాగాలనుంచి 5 రోజుల్లోగా ప్రభుత్వానికి సమర్పించాలని కేబినెట్ ఆదేశించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × two =