టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కరోనా పాజిటివ్‌

TRS MLC Kalvakuntla Kavitha Tested Positive For Covid-19, TRS MLC Kalvakuntla Kavitha Covid-19 Positive , MLC Kavitha Tested Covid Positive , TRS MLC Kavitha Covid 19, Covid TRS MLC Kalvakuntla Kavitha, Mango News, Mango News Telugu, MLC Kalvakuntla Kavitha Latest News And Updates, Carona Live Updates, Covid19 News And Latest Updates, Covid19 Vaccine, COVID New Variant, Booster Dose, India COVID News, CARONA, COVID News And Updates, Carona Vaccine

నిజామాబాద్‌ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కరోనా బారిన పడ్డారు. గత మూడు రోజులుగా దగ్గుతో బాధపడుతున్న ఆమెకు స్వల్ప లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ప్రస్తుతం తాను ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపిన ఎమ్మెల్సీ కవిత, ఇటీవల తనను కలిసిన వారందరూ ముందు జాగ్రత్తగా కోవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆమె స్వయంగా ట్విట్టర్‌లో తెలిపారు. ‘ఫ్లూ వంటి లక్షణాలు కనిపించిన తర్వాత, నేను కోవిడ్‌-19 కోసం స్వయంగా పరీక్షించుకున్నాను. ఈ పరీక్షల్లో నాకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గత 48 గంటల్లో నన్ను సంప్రదించిన ప్రతి ఒక్కరూ.. మీకు ఏవైనా లక్షణాలు కనిపిస్తే, వెంటనే ఐసొలేట్ అవ్వండి. అలాగే ఆలస్యం చేయకుండా తక్షణమే పరీక్షించుకోవాలని నేను అభ్యర్థిస్తున్నాను’ అని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here