టీఎస్ ఈసెట్-2021 ప్రవేశ పరీక్ష షెడ్యూల్ విడుదల

ECET-2021 Schedule Released, Mango News, Telangana ECET -2021, Telangana ECET -2021 Schedule, Telangana ECET -2021 Schedule Released, Telangana ECET 2021 exam, Telangana ECET 2021 examination, Telangana ECET 2021 examination schedule, TS ECET 2021 Exam Dates, TS ECET 2021 Notification & Schedule, TS ECET-2021 Schedule, TS ECET-2021 Schedule Released, TS ECET-2021 Schedule Released Today

తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ ఈసెట్-2021 ప్రవేశ పరీక్ష షెడ్యూల్ ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి మంగళవారం నాడు విడుదల చేసింది. జులై 1 వ తేదీన ఈసెట్‌-2021 ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈసీఈ, ఈఐఈ, సీఎస్‌ఈ, ఈఈఈ అభ్యర్థులకు, అలాగే మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సివిల్, కెమికల్, ఎంఈసీ, ఎంఐఎన్‌, ఎంఈటీ, పీహెచ్‌ఎం, బీఎస్‌ఎం అభ్యర్థులకు ప్రవేశ పరీక్ష జరగనుంది. నేడు జరిగిన టీఎస్‌ ఈసెట్ టెస్ట్‌ కమిటీ సమావేశం అనంతరం పూర్తి షెడ్యూల్ ను ఖరారు చేశారు. 2021 సంవత్సరానికి గానూ ఈసెట్ ప్రవేశ పరీక్షను జేఎన్టీయూ నిర్వహించనుంది.

టీఎస్ ఈసెట్-2021 పరీక్షషెడ్యూల్:

  • నోటిఫికేషన్‌ విడుదల: మార్చి 17
  • ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: మార్చి 22
  • దరఖాస్తుల స్వీకరణ ఆఖరు తేదీ (ఆలస్య రుసుము లేకుండా) : మే‌ 17
  • ఆలస్య రుసుము రూ.250 తో దరఖాస్తుకు ఆఖరు తేదీ: మే 31
  • ఆలస్య రుసుము రూ.500 తో దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూన్ 14
  • ఆలస్య రుసుము రూ.2500 తో దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూన్ 24
  • ఆలస్య రుసుము రూ.5000 తో దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూన్ 28
  • ఈసెట్ పరీక్ష నిర్వహణ : జులై 1
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + eleven =