ఆగస్టు 30 నుంచి టీఎస్‌ ఎంసెట్-2021 మొదటి విడత కౌన్సెలింగ్‌

TS Eamcea Eamcet-2021 Admissions Counselling First Phase Schedule Released, Mango News, Telangana To Begin First Phase Of TS EAMCET Counselling, TS Eamcet, TS EAMCET 2021, TS EAMCET 2021 Counselling 1st phase, TS EAMCET 2021 Counselling 1st phase schedule, TS EAMCET 2021 Counselling 1st phase schedule released ., TS EAMCET 2021 Counselling Schedule, TS Eamcet-2021 Admissions Counselling First Phase Schedule, TS Eamcet-2021 Admissions Counselling First Phase Schedule Releasedt-2021 Admissions Counselling First Phase Schedule Released

తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్‌-2021 మొదటి విడత కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుదలైంది.‌ ఆగస్టు 30 నుంచి మొదటి విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి అధ్యక్షతన మంగళవారం టీఎస్ ఎంసెట్-2021 అడ్మిషన్స్ కమిటీ సమావేశం జరిగింది. సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, టీఎస్ ఎంసెట్ కన్వీనర్, ఇతర అడ్మిషన్స్ కమిటీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొని అడ్మిషన్ ప్రక్రియపై చర్చించారు. అనంతరం కౌన్సెలింగ్‌ షెడ్యూల్ పై నవీన్ మిట్టల్ ప్రకటన విడుదల చేశారు. తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ కూడా త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.

టీఎస్‌ ఎంసెట్-2021 అడ్మిషన్స్ కౌన్సెలింగ్‌ షెడ్యూల్:

మొదటి విడత:

  • ఆన్‌లైన్ లో ప్రాథమిక సమాచారం నమోదు, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ – ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 9 వరకు
  • స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థుల సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసే తేదీలు – సెప్టెంబర్ 4 నుంచి సెప్టెంబర్ 11 వరకు
  • సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనంతరం వెబ్‌ ఆప్షన్స్ పక్రియ – సెప్టెంబర్ 4 నుంచి సెప్టెంబర్ 13 వరకు
  • ఆప్షన్స్ ఫ్రీజింగ్ సమయం – సెప్టెంబర్ 13
  • మొదటి విడత సీట్లు కేటాయింపు – సెప్టెంబర్ 15
  • వెబ్ సైట్ ద్వారా ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ – సెప్టెంబర్ 15 నుంచి సెప్టెంబర్ 20 వరకు

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 7 =