సంక్రాంతికి టీఎస్ఆర్టీసీ 4980 ప్రత్యేక బస్సులు

Mango News Telugu, Sankranthi Festival, Special Buses for Sankranthi Festival, telangana, telangana government, Telangana State Road Transport Corporation, Transport Minister, Transport Minister of Telangana, TSRTC, TSRTC Latest News, TSRTC News, TSRTC Sankranthi Festival, TSRTC Sankranthi Special Buses, TSRTC Special Buses, TSRTC Special Buses for Sankranthi Festival

సంక్రాంతి పండగ సందర్భంగా తెలంగాణలోని వివిధ ప్రాంతాలతో పాటుగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక బస్సులు నడిపేందుకు టిఎస్ఆర్టీసీ సిద్దమయింది. హైదరాబాద్ నగరం నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు మరియు ఏపీకి మొత్తం 4980 ప్రత్యేక బస్సులు నడపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రంగారెడ్డి ఆర్ఎం వెల్లడించారు. 4980 బస్సుల్లో తెలంగాణలోని ప్రాంతాలకు 3380, ఏపీకి 1600 బస్సులు నడపనున్నట్లు తెలిపారు. ప్రయాణికుల రద్దీ డిమాండ్ కు అనుగుణంగా జనవరి 8 వ తేదీ నుంచి జనవరి 14 వరకు ఈ ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు తెలిపారు. ఈ బస్సుల్లో అడ్వాన్స్‌డ్ బుకింగ్ సౌకర్యం కూడా కల్పిస్తున్నామని, www.tsrtconline.in వెబ్ సైట్ ద్వారా ప్రజలు టికెట్స్ బుక్ చేసుకోవచ్చని చెప్పారు. ఎంజీబీఎస్‌, జూబ్లీ బస్ స్టేషన్ తో పాటుగా కేపీహెచ్‌బీ, ఎస్ఆర్ నగర్, అమీర్ పేట్, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌ వంటి అనేక ప్రధాన బస్ స్టాఫ్ ల నుంచి కూడా ప్రత్యేక బస్సులను వివిధ ప్రాంతాలకు నడపనున్నట్టు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − three =