ఆర్టీసీలో రూ.100తో ఒక రోజంతా ప్రయాణం, టీ-24 పేరుతో ప్రత్యేక పాస్

Hyderabad, Mango News, T-24 Pass for 24-hour with Rs 100, TSRTC, TSRTC Bus Fares 2021, TSRTC introduces 24-hour pass for commuters, TSRTC Introduces T-24 Pass for 24-hour, TSRTC Introduces T-24 Pass for 24-hour with Rs 100, TSRTC Introduces T-24 Pass for 24-hour with Rs 100 for the Commuters, TSRTC Introduces T-24 Pass for 24-hour with Rs 100 for the Commuters in Hyderabad, TSRTC Latest News, TSRTC Latest Updates

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) తాజాగా ప్రయాణికులకు మరో సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాల పరిధిలోని ప్రయాణికులకు టీ-24 (ట్రావెల్‌ 24 అవర్స్‌) పేరుతో 24 గంటల పాటుగా చెల్లుబాటు అయ్యే ప్రత్యేక పాస్/టికెట్ ను అందుబాటులోకి తీసుకువస్తునట్టు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ప్రకటించారు. రూ.100తో జారీచేసే టీ-24 పాస్ తో ఒక రోజంతా(24 గంటల పాటు) హైదరాబాద్‌ లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చని తెలిపారు. ఈ పాస్ కు సిటీ ఆర్డినరీ, సబర్బన్‌, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, మెట్రో డీలక్స్‌ బస్సుల్లో అనుమతి ఉంటుందని చెప్పారు.

టీ-24 టికెట్లు కండక్టర్లు వద్ద అందుబాటులో ఉంటాయన్నారు. మరోవైపు విధుల్లో ఉన్నప్పుడు ఆర్టీసీ బస్సులో కానీ, బస్‌స్టేషన్‌ ప్రాంగణంలో కానీ సిబ్బంది పాన్‌ మసాలాలు, గుట్కాలు వాడకూడదని ఉత్తర్వులు ఇచ్చారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకోవాలని రీజినల్‌, డివిజినల్‌, డిపో మేనేజర్లకు ఎండీ వీసీ సజ్జనార్‌ ఆదేశాలు జారీచేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + six =