ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన క‌ల్వ‌కుంట్ల‌ క‌విత

K Kavitha To Take Oath As Nizamabad MLC, Kalvakuntla Kavitha, Kalvakuntla Kavitha to be sworn in, Kalvakuntla Kavitha to be sworn in today, Kalvakuntla Kavitha to take oath as MLC, Kalvakuntla Kavitha to take oath as MLC today, Nizamabad MLC, TRS Leader K Kavitha To Take Oath, TRS Leader K Kavitha To Take Oath As Nizamabad MLC

నిజామాబాద్‌ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీకి జరిగిన ఉపఎన్నికలో టిఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన కల్వకుంట్ల కవిత ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిజా‌మా‌బాద్‌ స్థానిక సంస్థల ఎమ్మె‌ల్సీగా కల్వ‌కుంట్ల కవిత గురు‌వారం నాడు ప్రమాణం స్వీకారం చేశారు. శాస‌న‌స‌మం‌డలి చైర్మన్‌ గుత్తా సుఖేం‌ద‌ర్‌‌రెడ్డి ఆమె చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు వేముల ప్ర‌శాంత్ రెడ్డి, సత్యవతి రాధోడ్, నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తదితరులు పాల్గొని కవితకు శుభాకాంక్ష‌లు తెలియజేశారు. ముందుగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కవిత భారీ మెజార్టీతో విజయం సాధించారు. మొత్తం 823 ఓట్లు పోల్ అవగా, టిఆర్ఎస్ పార్టీకి 728 ఓట్లు, బీజేపీకి 56, కాంగ్రెస్ కి 29 ఓట్లు వచ్చాయి. అలాగే 10 ఓట్లు చెల్లలేదని అధికారులు పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − twelve =