మధ్యప్రదేశ్‌లో కుప్పకూలిన రెండు ఫైటర్ జెట్ విమానాలు.. పైలట్ దుర్మరణం, ఇద్దరికి గాయాలు

2 IAF Fighter Jets Sukhoi-30 Mirage-2000 Crash Near Madhya Pradesh’s Morena One Pilot Lost Life and Two Injured,2 IAF Fighter Jets Sukhoi-30, Mirage-2000 Crash Near,Madhya Pradesh’s Morena,One Pilot Lost Life and Two Injured,Mango News,Mango News Telugu,National Politics News,National Politics And International Politics,National Politics Article,National Politics In India,National Politics News Today,National Post Politics,Nationalism In Politics,Post-National Politics,Indian Politics News,Indian Government And Politics,Indian Political System,Indian Politics 2023,Recent Developments In Indian Politics,Shri Narendra Modi Politics,Narendra Modi Political Views,President Of India,Indian Prime Minister Election

భారత వైమానిక దళానికి చెందిన రెండు యుద్ధ విమానాలు శనివారం మధ్యప్రదేశ్‌లో కూలిపోయాయి. ఈ మేరకు వైమానిక దళం వెల్లడించింది. ఈరోజు తెల్లవారుజామున శిక్షణలో భాగంగా సుఖోయ్ సు -30 మరియు మిరాజ్-2000 ఫైటర్ జెట్‌లు కుప్పకూలాయని పేర్కొంది. ఇక వేర్వేరుగా జరిగిన ఈ ఘటనల్లో ఒక పైలట్ దుర్మరణం చెందాడని, మరో ఇద్దరు గాయపడ్డారని వైమానిక అధికారులు ప్రకటించారు. గ్వాలియర్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుండి బయలుదేరిన కొద్దిసేపటికే ఈ రెండు ఫైటర్ జెట్‌లు కూలిపోయినట్లు వారు వివరించారు. కాగా ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు విచారణకు ఆదేశించినట్లు వారు తెలిపారు. గాలిలో ఢీకొన్నారా లేక లేక మిడ్-గార్ తాకిడి ప్రమాదానికి దారితీసిందా అనే విషయాన్ని నిర్ధారించడానికి ఐఏఎఫ్ కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ చేస్తామని వారు వెల్లడించారు.

కాగా ఈ ఘటనలో మధ్యప్రదేశ్‌లోని మొరెనాలో ఒక విమానం కూలిపోగా, మరొకటి రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో 100 కిలోమీటర్ల దూరంలో కూలిపోయినట్లు భావిస్తున్నారు. సుఖోయ్‌లో ఇద్దరు పైలట్‌లు ఉండగా, మిరాజ్‌లో ఒక పైలట్ ఉన్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. రెండు విమానాలను భారత వైమానిక దళం ముందు వరుసలో ఉపయోగిస్తుంది. ఇక సమాచారం అందుకున్న రక్షణ వర్గాలు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకొని సుఖోయ్‌లోని ఇద్దరు పైలట్‌లను హెలికాప్టర్‌లో ఆసుపత్రికి తరలించారు. కాగా రెండు విమానాలు కూలిన ఘటనపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు భారత వాయుసేన చీఫ్‌ వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు తమ రాష్ట్రంలో ప్రమాదం జరిగిన నేపథ్యంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ పరిస్థితిని పర్యవేక్షించడానికి ప్ర్తయేకంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక రూపొందించిన సుఖోయ్ యుద్ధ విమానాన్ని రష్యా నుంచి, అలాగే మిరాజ్-2000 ఫైటర్ జెట్‌ను ఫ్రెంచ్ నుంచి భారత్ కొనుగోలు చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 4 =