రాజన్న సిరిసిల్ల జిల్లాలో వ్యవసాయ కళాశాలను ప్రారంభించిన మంత్రులు కేటీఆర్‌, నిరంజన్‌ రెడ్డి

Ministers KTR and Niranjan Reddy Inaugurated The Agriculture College in Rajanna Sircilla District,Ministers KTR and Niranjan Reddy Inaugurated,The Agriculture College in Rajanna Sircilla District,KTR and Niranjan Reddy Inaugurated The Agriculture College,Rajanna Sircilla District,Mango News,Mango News Telugu,Agricultural College inaugurated in Jillela,Minister KTR Inaugurated Under Dalith Bandhu Scheme,TS Agriculture Minister Niranjan Reddy,Agricultural College inauguration News Today,Ministers KTR Latest News,Niranjan Reddy Latest Updates

ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల సమీపంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ కళాశాల నూతన భవన సముదాయాలను మంత్రులు కేటీఆర్‌, నిరంజన్‌ రెడ్డి ప్రారంభించారు. మంత్రులతో పాటు శాసనసభా సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌ కుమార్‌, ఎమ్మెల్యేలు చెన్నమనేని రమేశ్‌ బాబు, రసమయి బాలకిషన్‌, సుంకె రవి శంకర్‌ తదితరులు హాజరయ్యారు. అలాగే ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి, ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఇంచార్జీ వైస్ ఛాన్సలర్ రఘునందన్ రావు , రిజిస్ట్రార్ డాక్టర్ సుదీర్ బాబు, వ్యవసాయ విశ్వవిద్యాలయం డీన్‌ డాక్టర్‌ సీమ, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, కళాశాల ప్రిన్సిపాల్ ఉమా మహేశ్వరి, జిల్లా వ్యవసాయ అధికారి రణధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు కలియతిరుగుతూ భవన సముదాయాలను పరిశీలించారు.

సిరిసిల్ల, సిద్దిపేట, హైదరాబాద్‌ ప్రధాన రహదారి పక్కన దాదాపు 35 ఎకరాల విస్తీర్ణంలో 69.30 కోట్లతో ప్రభుత్వం ఈ కళాశాలను ఏర్పాటు చేసింది. 16 ఎకరాల్లో జీ ప్లస్‌ 2 పద్ధతిలో కళాశాల భవనంతో పాటు విద్యార్థిని, విద్యార్థులకు వేర్వేరు హాస్టళ్లు నిర్మించారు. మరో 19 ఎకరాల్లో వ్యవసాయ పరిశోధనా క్షేత్రం, ఫాంలాండ్స్‌ను ఏర్పాటు చేశారు. అలాగే అత్యాధునిక కంప్యూటర్‌ ల్యాబ్‌లు, ప్రయోగశాల, సెమినార్‌ రూములు, అధ్యాపకుల గదులు, అసోసియేట్‌ డీన్‌ చాంబర్‌, ఆధునిక లైబ్రరీ వంటివి కూడా నిర్మించారు. కాగా మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో.. సిరిసిల్ల జిల్లా ఎడ్యుకేషన్‌ హబ్‌గా ఎదుగుతోంది. రాష్ట్రంలోనే తొలి కేజీ టూ పీజీ క్యాంపస్‌, గురుకులాలు, కేజీబీవీలు, మోడల్‌ స్కూళ్లు, వ్యవసాయ పాలిటెక్నిక్‌, వ్యవసాయ కళాశాల, జేఎన్టీయూ ఇంజినీరింగ్‌ కాలేజీలు, ఐటీఐ, నర్సింగ్‌, జేఎన్‌టీయూ కాలేజీలు, రాష్ట్రంలోనే తొలి ఫైన్‌ ఆర్ట్స్‌ కళాశాల, ఇంటర్నేషనల్‌ డ్రైవింగ్‌ స్కూల్‌ వంటివి ఇప్పటికే ఏర్పాటైన విషయం తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + 4 =