కారు పార్టీలో ఉంటారా? జంపవుతారా?

Kotha Prabhakar Reddy,kottha Prabhakar Reddy politics, BRS party, Congress, Dubbaka, Revanth Reddy, BRS, TRS Party, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Hyderabad News,Telangana News, Political Updates, Mango News Telugu, Mango News
Kotha Prabhakar Reddy,kottha Prabhakar Reddy politics, BRS party, Congress, Dubbaka, Revanth Reddy

కొద్ది రోజులుగా  దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నిత్యం వార్తల్లో ఉంటున్న నేతగా మారిపోయారు.ఇటీవల ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినప్పటి నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి  పైన పెద్ద చర్చే నడుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీష్ రావుకు కూడా అత్యంతసన్నిహితంగా ఉండే కొత్త ప్రభాకర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని  కలవడంతో అప్పుడు అది పెద్ద సెన్సేషనల్ న్యూస్ అయ్యింది.

అయిందేదో అయింది అనుకుంటే తాజాగా అసెంబ్లీలో ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి   కొత్త ప్రభాకర్ రెడ్డి రాకపోవడంతో మళ్లీ ఆయనపై  చర్చ మొదలైంది. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయినా..  కొత్త ప్రభాకర్ రెడ్డి  కేసీఆర్ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరు కాకపోవడం హాట్ టాపిక్ అయింది. అందులోనూ ఫిబ్రవరి 1వ తేదీన  కొత్త ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్‌లోనే ఉండీ కూడా రాకపోవడం కొత్త అనుమానాలను లేవనెత్తుతోంది.

దీంతో కొత్త ప్రభాకర్ రెడ్డి  పార్టీ మారుతారని, కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం ఊపందుకుంది.అందుకే ఆయన రేవంత్ రెడ్డిని కలిశారని, తనతో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలను తీసుకెళ్లారని వార్తలు స్పీడందుకున్నాయి. సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి కొత్త ప్రభాకర్ రెడ్డే అపాయింట్మెంట్ తీసుకున్నారని, ఆ విషయం బీఆర్ఎస్ పార్టీ పెద్దలకు కూడా తెలియదనే వార్తలు వినిపిస్తున్నాయి.

నిజానికి కొత్త ప్రభాకర్ రెడ్డికి చాలా రోజుల నుంచి ఎమ్మెల్యే కావాలనే కోరిక ఉంది.  బీఆర్ఎస్ పార్టీ నుంచి మెదక్ ఎంపీగా రెండు సార్లు గెలిచినా కూడా ఆయనకు ఎమ్మెల్యే పదవి పైనే మక్కువ ఎక్కువ అని ఆయన సన్నిహితులు చెబుతూ ఉంటారు. అందుకే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి దుబ్బాక ఎమ్మెల్యే టికెట్‌ను కొత్త ప్రభాకర్ రెడ్డికి ఇచ్చారు. హరీష్ రావుకు అత్యంత నమ్మకస్థుడుగా కొత్త ప్రభాకర్ రెడ్డికి పేరు ఉంది. దీంతోనే ఎన్నికల ప్రచారంలో ఉండగా ప్రభాకర్ రెడ్డిపై కత్తి దాడి జరిగినప్పుడు అతనిని  ఆసుపత్రిలో చేర్పించి, ప్రచార బాధ్యతలను  హరీష్ రావే చూసుకున్నారు.

మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో  కొత్త ప్రభాకర్ రెడ్డికి మంచి పేరే ఉందని, ఆయన పార్టీ మారుతారనే జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని బీఆర్ఎస్ పెద్దలు  కొట్టి పడేస్తున్నారట. హరీష్ రావుని కాదని కొత్త ప్రభాకర్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకోరంటూ నమ్మకంగా చెబుతున్నారట.అయితే  ఎమ్మెల్యేకు సరైన ప్రోటోకాల్ ఇవ్వడం లేదని ఈ మధ్య  రేవంత్ రెడ్డిని  కలిశారని బయటకు చెబుతున్నా.. కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యవహార శైలి మాత్రం కొంత తేడాగానే ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.  ఇటు తమకు చెప్పకుండా ముఖ్యమంత్రిని కలవడంపై కేసీఆర్ మందలించారని అందుకే ఆయన ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారానికి కొత్త ప్రభాకర్ రెడ్డి రాలేదన్న వార్తలు వినిపిస్తున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 14 =