వాళ్లు ఎవరికి మద్దతు ఇస్తే వారిదే అంబర్‌పేటలో విజయం

Whoever they support will win in Amberpet constituency,Whoever they support will win,win in Amberpet constituency,support in Amberpet constituency,Mango News,Mango News Telugu,Amberpet Assembly Election 2023,Amberpet, Amberpet constituency, win in Amberpet,BRS, Congress,KCR,KTR, Revanth Reddy,Raithu Bandhu, Minister, Mla, Telengana Assembly Elections 2023,Amberpet constituency Latest News,Amberpet constituency Latest Updates,Congress Latest News,Congress Latest Updates
Amberpet, Amberpet constituency, win in Amberpet,BRS, Congress,KCR,KTR, Revanth Reddy,Raithu Bandhu, Minister, Mla, Telengana Assembly Elections 2023,

ప్రతీ ఎన్నికలలోనూ అంబర్‌పేట నియోజకవర్గంలో..  బీసీ ఓటర్లే అక్కడి అభ్యర్థుల జాతకాలను తేలుస్తున్నారు. అంటే బీసీ ఓటర్ల వల్ల అక్కడ నిలబడ్డ వివిధ పార్టీ అభ్యర్థుల గెలుపు, ఓటములు డిసైడ్ అవుతున్నాయి. అవును ఏ పార్టీకి బీసీ కులాలు  మద్దతు ఇస్తాయో ఆ పార్టీ అభ్యర్థే ఇప్పటి వరకూ విజయం సాధిస్తూ వస్తున్నారు.దశాబ్ధాల కాలం నుంచి ఇదే డిసైడ్ అవుతూ వస్తోంది.

 

1978 నుంచి 2018 వరకు జరిగిన ఎన్నికల్లో బీసీల మద్దతు ఉన్న ఆయా పార్టీల అభ్యర్థులే విజయం సాధించారు. 1978 వ సంవత్సరంలో హిమాయత్‌నగర్‌ నియోజకవర్గం నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన లక్ష్మీకాంతమ్మ మొట్టమొదటిసారిగా అక్కడ విజయం సాధించింది. 1983లో జరిగిన ఎన్నికల్లో నారాయణరావు గౌడ్‌, 1985లో జరిగిన ఎన్నికల్లో ఆలె నరేంద్ర, 1989లో జరిగిన ఎన్నికల్లో  వి.హనుమంతరావు గెలిచారు.

 

1992లో జరిగిన ఎలక్షన్స్‌లో ఆలె నరేంద్ర, అలాగే 1994, 1999 వ సంవత్సరం  జరిగిన ఎన్నికల్లో సి.కృష్ణాయాదవ్‌ విజయం సాధించారు. అంతేకాదు 2004, 2009, 2014లో జరిగిన ఎన్నికలలో.. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన జి.కిషన్‌రెడ్డి విజయం సాధించగా.. 2018లో బీసీ వంజర కులానికి చెందిన కాలేరు వెంకటేష్‌ గెలిచారు.

 

అంబర్‌పేట నియోజకవర్గంలో మొత్తం 2,74, 911 ఓటర్లు ఉండగా, వారిలో 1.70 లక్షల బీసీ సామాజిక వర్గాలకు చెందిన ఓటర్లే ఉన్నారు. యాదవులు 26 వేలు, గౌడ కులస్థులు 25 వేలు, పద్మశాలీలు 20 వేలు ఉండగా.. ముదిరాజ్‌లు 10 వేలు, గంగపుత్రులు 20 వేలు, మున్నూరుకాపులు 18 వేలు, విశ్వకర్మలు 12 వేలు, గొల్ల కురుమలు 3 వేలు, కుమ్మరులు 5 వేల వరకు  ఉన్నారు. ఎస్సీలు 25వేలు, ఎస్టీలలో 6 వేల ఓటర్లు ఉన్నారు. బీసీలలోని ఇతర కులాలకు చెందిన మరో 30 వేలమంది ఓటర్లు ఉన్నారు.అలాగే ఈ మైనారిటీ ఓటర్లు 48,563 వరకు ఉన్నారు.

 

అందుకే ప్రతీ ఎన్నికల్లోనూ అంబర్‌పేట నియోజకవర్గంలో  ఈ కులాల ఓటర్లే అభ్యర్థుల గెలుపోటములను శాసిస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు దాదాపు 20 వేల వరకు ఇక్కడ ఉన్నారు. అలాగే బ్రాహ్మణ ఓటర్లు కూడా దాదాపు 10 వేల వరకు ఉన్నారు. ఈ ఓట్లు కూడా ప్రస్తుతం జరగనున్న ఎన్నికల్లో కీలకం కానున్నాయి. నవంబర్ 30 న జరిగే ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు.. అంబర్‌పేట నియోజకవర్గంలో పోటీ పడుతున్నారు.

 

బీఆర్‌ఎస్‌  పార్టీ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌ బరిలో దిగగా..భారతీయ జనతా పార్టీ నుంచి యాదవ కులానికి చెందిన సి.కృష్ణ యాదవ్‌ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన డాక్టర్‌ సి.రోహిణ్‌రెడ్డి పోటీలో ఉన్నారు. ఈ మూడు ప్రధాన పార్టీలకు ఇప్పుడు కూడా బీసీల ఓట్లే కీలకంగా మారాయి.అంతేకాదు వీరితో పాటు ఇక్కడ కర్నాటక,గుజరాత్‌, రాజస్థాన్‌, మహరాష్ట్ర రాష్ట్రాలకు చెందిన ఓటర్లు  కూడా ఉన్నారు. ప్రస్తుతం వీరందరినీ ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు అభ్యర్థులు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × three =