వరంగల్ జిల్లా అభ్యర్థులలో కోవర్టుల టెన్షన్

Congress Party is Another Senior Leader in The CM Race 2,Congress Party is Another Senior Leader,Another Senior Leader in The CM Race 2,Mango News,Mango News Telugu,covert politics in warangal district, candidates,tension ,Disturbing covert politics, Covert tension among Warangal district, candidates,politics in warangal district Latest News,politics in warangal district Latest Updates,warangal district Latest News,warangal district Live News,Congress party Latest News,Congress party Latest Updates
covert politics in warangal district, candidates,tension ,Disturbing covert politics, Covert tension among Warangal district, candidates

తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతోన్న కొద్దీ రాజకీయాలు పదునెక్కుతూ హీటును పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చాలా నియోజకవర్గాలలో రాజకీయంగా రగులుకుంటున్న హీట్ పీక్స్ కు చేరుకుంది. ఇప్పటికే  అన్ని నియోజకవర్గాలలో ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసి..ఎన్నికల ప్రచార పర్వాన్ని కూడా జోరుగా కొనసాగిస్తున్నారు.

అయితే ఇదే సమయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగాక నియోజకవర్గాలలో ద్వితీయ శ్రేణి నాయకులను కోవర్టులుగా రంగంలోకి దించారన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.తమ వారిని ప్రత్యర్థుల పార్టీల దగ్గరకు కావాలని పంపిస్తూ, అక్కడ అపోజిషన్ నేతలు చేస్తున్న రాజకీయాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారన్న వాదన వినిపిస్తోంది.  ఎప్పటికప్పుడు ఆయా నేతల ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నారన్న న్యూస్ వినిపిస్తోంది.

నవంబర్ 30న పోలింగ్ లో తెలంగాణ రాజకీయాలలో అమీతుమీ తేల్చుకోవడానికి రెడీ అయిన అన్ని పార్టీల నాయకులు కూడా..  కోవర్టు రాజకీయాలు చేస్తుండడం చర్చనీయాంశంగా మారిపోయింది.  చివరకు అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్, బీజేపీలు చాలా నియోజకవర్గాలలో కోవర్ట్ రాజకీయాలు చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వరంగల్ తూర్పు, నర్సంపేట, వర్ధన్నపేట నియోజకవర్గాలలో.. ఎవరూ ఏ మాత్రం ఊహించని స్థాయిలో  విపరీతంగా చేరికలు కొనసాగుతున్నాయి.

కోవర్టులను రంగంలోకి దింపి ప్రత్యర్థులకు పొలిటికల్ చెక్ పెట్టడానికి  అన్ని పార్టీల నేతలు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు అన్ని పార్టీల్లోకి చేరికలు విపరీతంగా కొనసాగుతున్నాయి. దీంతో వారిలో  తమకోసం నిజంగా పనిచేసేవారు ఎవరు?  కోవర్టులెవరు? అనేది తెలియక అభ్యర్థులు, నేతలు తెగ ఇబ్బంది పడుతున్నారు.వచ్చిన వాళ్లందరినీ అనుమానిస్తే..నిజంగా తమ పార్టీని అభిమానించేవాళ్లను దూరం చేసుకుంటామేమోనని  భయపడుతున్నారు.

ఈ మధ్య కాలంలో ముఖ్యంగా  వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి, కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్‌లోకి చేరికలు కొనసాగడం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఈ చేరికలన్నీ నిజంగానే ఎన్నికల సమయంలో కొనసాగుతున్న చేరికలా లేదా.. కోవర్ట్ ఆపరేషన్‌లో భాగంగా కొనసాగుతున్న చేరికలా అనేది నేతలకు  అంతు  బట్టడం లేదు.

వారంతా నిజంగానే తమపై , తమ పార్టీపై  అభిమానంతో పార్టీలోకి మారుతున్నారా అన్న అనుమానంలో ఆ నేతలు పడుతున్నారు. నిజంగా పార్టీ మీద అభిమానంతో వస్తే ఓకే..కానీ ఒక రకమైన ట్రాప్ పాలిటిక్స్ కోసం వస్తేనే అసలు సమస్య అంటూ మల్లగుల్లాలు పడుతున్నారు. ఎలా అయినా ఈసారి ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా అన్ని పార్టీలు పనిచేయడంతో ఏదైనా జరిగే అవకాశం ఉండొచ్చని అటు రాజీకీయ విశ్లేషకులు కూడా అంటున్నారు. మొత్తంగా ఆసక్తికర పరిణామాలతో.. ఉమ్మడి వరంగల్ వేదికగా సాగుతున్న కోవర్ట్ పాలిటిక్స్ తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × four =