34వ రోజుకు చేరిన వైఎస్ షర్మిల ‘ప్ర‌జా ప్ర‌స్థానం’ పాదయాత్ర, 400 కిలోమీట‌ర్లు పూర్తి

YS Sharmila Praja Prasthanam Padayatra Reached to 34th Day Completes 400 KM Milestone, YS Sharmila Praja Prasthanam Padayatra Completes 400 KM Milestone, YS Sharmila Praja Prasthanam Padayatra Reached to 34th Day, 400 KM Milestone, YS Sharmila Praja Prasthanam Padayatra, YS Sharmila, Praja Prasthanam Padayatra, Praja Prasthanam Padayatra Latest News, Praja Prasthanam Padayatra Latest Updates, Praja Prasthanam Padayatra Live Updates, YS Sharmila Padayatra,` YSR Telangana Party, YSR Telangana Party YS Sharmila Padayatra,` Sharmila Praja Prasthanam Padayatra, Mango News, Mango News Telugu,

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ‘ప్ర‌జా ప్ర‌స్థానం’ పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ పాదయాత్ర‌ 34వ రోజుకు (మార్చి 23, బుధవారం) చేరుకోగా, 400 కిలో మీట‌ర్లును మైలురాయిని కూడా దిగ్విజ‌యంగా పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా ఉమ్మ‌డి నల్గొండ జిల్లా ఆలేరు నియోజ‌క‌వ‌ర్గం మోట‌కొండూరు మండ‌లం చండేప‌ల్లి గ్రామంలో వైఎస్ ష‌ర్మిల తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖ‌ర్ రెడ్డి విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పోరాడుతూనే ఉంటుంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో పలువురు పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ముందుగా అక్టోబర్‌ 20, 2021న చేవెళ్లలో ప్రారంభించిన ప్రజాప్రస్థానం పాదయాత్ర 21 రోజుల పాటు దిగ్విజ‌యంగా సాగిన అనంతరం ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి రావడం, కరోనా పరిస్థితుల కారణంగా తాత్కాలికంగా వాయిదా పడింది. ఈ క్రమంలో మార్చి 11న నల్గొండ జిల్లా నార్కెట్ ప‌ల్లి మండ‌లంలోని కొండ‌పాక‌గూడెం గ్రామం నుంచి తన ప్ర‌జాప్ర‌స్థానం పాదయాత్రను వైఎస్ షర్మిల పునఃప్రారంభించారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవుతూ, సమస్యలు తెలుసుకుంటూ ఆమె తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here