అత్యంత విషమంగా ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం

Balasubrahmanyam, MGM Healthcare, Singer SP Balasubrahmanyam, Singer SP Balasubrahmanyam Health Condition, sp balasubrahmanyam health condition, SP Balasubrahmanyam Health Condition is Extremely Critical, SP Balasubrahmanyam Health News, SP Balasubrahmanyam Health Updates

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో గత కొన్ని రోజులుగా చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయనకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఫలితం నెగెటివ్‌ గా వచ్చినట్లు పేర్కొన్నారు. అయితే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి మరోసారి విషమించింది. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎంజీఎం ఆసుపత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఎక్మో సపోర్ట్‌ సహా ఇతర లైఫ్ సపోర్ట్ లతో చికిత్స అందిస్తున్నట్టు బులెటిన్ లో పేర్కొన్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి గత 24 గంటల్లో క్షీణించిందని, పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉందని తెలిపారు. వైద్య నిపుణుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోందని చెప్పారు.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu