దేశంలో ఉత్తమ పోలీస్ స్టేషన్లలో టాప్ 10లో నిలిచిన జమ్మికుంట పోలీస్ స్టేషన్

Jammikunta Police Station In Telangana Listed In Top 10 Best Police Stations Of The Country,Jammikunta Police Station Among 10 Best In The Country,Jammikunta Town PS Among The Top Ten In The Country,Jammikunta,Jammikunta Town,Jammikunta Town PS,Jammikunta Police Station,Jammikunta Town Police Station,Telangana,Top 10 Best Police Stations Of The Country,Top 10,Top 10 Police Stations,Jammikunta Police Station,Jammikunta PS In Telangana In Top 10 Best Police Stations In Country,Home Ministry,Ministry of Home Affairs,Jammikunta PS,Mango News,Mango News Telugu

దేశంలోని 16,671 పోలీస్ స్టేషన్లలో టాప్ 10 లో నిలిచిన ఉత్తమ పోలీస్ స్టేషన్ల జాబితాను కేంద్ర హోమ్ శాఖ గురువారం నాడు విడుదల చేసింది. ఈ జాబితాలో తెలంగాణలో కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట పోలీస్‌స్టేషన్‌ 10వ స్థానం దక్కించుకుంది. డేటా విశ్లేషణ, ప్రత్యక్ష పరిశీలన మరియు ప్రజల అభిప్రాయాల ప్రాతిపదికన ప్రతి రాష్ట్రంలో ఉత్తమంగా పనిచేసే పోలీసు స్టేషన్లను ఎంపిక చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ల యొక్క సమర్థవంతమైన పనితీరును ప్రోత్సహించడానికి మరియు వాటిలో ఆరోగ్యకరమైన పోటీని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా ఉత్తమంగా పనిచేసే పోలీసు స్టేషన్లను ఎంపిక చేస్తుంది.

దేశంలోనే టాప్ 10 పోలీస్‌ స్టేషన్లలో కరీంనగర్‌ పోలీస్‌ కమిషనరేట్‌కు చెందిన జమ్మికుంట పోలీస్ స్టేషన్‌ ఎంపిక కావడం పట్ల తెలంగాణ డీజీపీ మహేందర్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. “జమ్మికుంట టౌన్ పోలీస్ స్టేషన్ 2020 సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం చేత టాప్ 10లో ఎంపిక చేయబడింది. జమ్మికుంట టౌన్ పోలీస్ స్టేషన్ యొక్క సిబ్బంది మరియు అధికారులకు హృదయపూర్వక అభినందనలు. మీ ఘనతకు మేమంతా గర్వపడుతున్నాం. కరీంనగర్ పోలీస్ కమిషనర్ మరియు ఇతర పర్యవేక్షక అధికారులందరికీ అభినందనలు” అని డీజీపీ మహేందర్‌ రెడ్డి పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ