తెలంగాణ రాష్ట్రంలో కొలువుల జాతర కొనసాగుతోంది. తాజాగా అగ్నిమాపక శాఖలో డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. ప్రస్తుతం అగ్నిమాపక శాఖలో డ్రైవర్ ఆపరేటర్ విభాగంలో 225 ఖాళీలు ఉండగా వీటిని భర్తీ చేయనున్నారు. ఈమేరకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అధికారిక వెబ్సైట్ www.tslprb.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలియజేసింది. దీనికి కనీస విద్యార్హత ఇంటర్మీడియట్ అని, అర్హులైన వారు మే 21 నుంచి మే 26 రాత్రి 10 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్ లో తెలిపింది. కాగా అభ్యర్థుల గరిష్ఠ వయో పరిమితి అయిదేళ్లు పెంచినట్లు పేర్కొంది.
జోన్ల వారీగా ఖాళీల వివరాలు – మొత్తం ఖాళీలు: 225
- జోన్ – I : కాళేశ్వరం – 20
- జోన్ – II : బాసర – 21
- జోన్ – III : రాజన్న సిరిసిల్ల – 31
- జోన్ – IV : భద్రాద్రి – 31
- జోన్ – V : యాదాద్రి – 31
- జోన్ – VI : చార్మినార్ – 70
- జోన్ – VII : జోగులాంబ గద్వాల్ – 21
నోటిఫికేషన్ వివరాలు
- విద్యార్హత: ఇంటర్మీడియట్
- వయస్సు: జులై 1, 2022 నాటికి 21 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి
- దరఖాస్తు స్వీకరణ గడువు: మే 21 నుంచి మే 26
- ఇతర అర్హతలు: నోటిషికేషన్ తేదీ నాటికి రెండేళ్లు లేదా అంతకంటే ముందు హెవీ మోటర్ వెహికిల్ లైసెన్స్ పొంది ఉండాలి
- ఆన్లైన్ లింక్: www.tslprb.in
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ