అఖిలేష్‌ యాదవ్‌తో భేటీ అయిన సీఎం కేసీఆర్‌, బీజేపై పోరుకు కలిసి సాగాలని నిర్ణయం?

Telangana CM KCR Meets Samajwadi Party Chief Akhilesh Yadav in Delhi Today, CM KCR Meets Samajwadi Party Chief Akhilesh Yadav in Delhi Today, KCR Meets Samajwadi Party Chief Akhilesh Yadav in Delhi Today, Telangana CM K Chandrashekar Rao Meets Samajwadi Party Chief Akhilesh Yadav in Delhi Today, Samajwadi Party Chief Akhilesh Yadav, Akhilesh Yadav, Samajwadi Party Chief, Samajwadi Party, Delhi, Nationwide Tour of CM KCR, Telangana CM KCR to Start Country Wide Tour, CM KCR to Country Wide Tour, CM KCR to Country Wide Tour News, CM KCR to Country Wide Tour Latest News, CM KCR to Country Wide Tour Latest Updates, CM KCR to Country Wide Tour Live Updates, KCR on nation-wide tour from today, Telangana CM KCR To Begin Nationwide Tour, CM KCR, KCR, Telangana CM KCR, K Chandrashekar Rao, Chief minister of Telangana, K Chandrashekar Rao Chief minister of Telangana, Telangana Chief minister, Telangana Chief minister K Chandrashekar Rao, Mango News, Mango News Telugu,

జాతీయస్థాయిలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మే 20 నుంచి పదిరోజుల పాటుగా దేశవ్యాప్తంగా పర్యటించనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ దేశవ్యాప్త పర్యటనలో సీఎం కేసీఆర్ బిజీగా గడుపుతున్నారు. దీనిలో భాగంగా ఆయన ఈరోజు సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్‌ను సీఎం కేసీఆర్ 23 తుగ్లక్ రోడ్డులోని తన నివాసానికి విందుకు ఆహ్వానించారు. కాగా సీఎం కేసీఆర్, అఖిలేష్ యాదవ్ భేటీ గురించి తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం కూడా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో తెలిపింది.

ఈ సమావేశంలో దేశంలోని ప్రస్తుత ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై వీరిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై కూడా అఖిలేష్ యాదవ్ తో చర్చించినట్లు సమాచారం. అలాగే కేంద్రంలోని అధికార బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కలిసివచ్చే ఇతర ప్రాంతీయ పార్టీలతో ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుకు గల సాధ్యాసాధ్యాలను పరిశీలించినట్లు తెలుస్తోంది. అనంతరం ఢిల్లీలో మీడియా ప్రతినిధులతోనూ సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వెంట రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, ఎంపీలు సంతోష్‌కుమార్‌, రంజిత్‌రెడ్డి ఉన్నారు.

ఢిల్లీ పర్యటన అనంతరం సీఎం కేసీఆర్ 22న చండీగఢ్, 26న బెంగళూరు, 27న రాలేగావ్ సిద్ధి, 29 లేదా 30 తేదీల్లో బెంగాల్, బీహార్‌లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆర్మీ అమరవీరుల కుటుంబాలను, రైతుబంధు నిర్మూలన ఉద్యమంలో మృతి చెందిన 600 రైతు కుటుంబాలను కేసీఆర్ పరామర్శించనున్నారు. రూ. 3 లక్షల చొప్పున చెక్కులను పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా హాజరుకానున్నట్లు టీఆర్ఎస్ నేతలు తెలిపారు. అనంతరం బెంగళూరు పర్యటనలో మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ సీఎం కుమార స్వామితో కేసీఆర్ భేటీ కానున్నారు. 27న రాలేగావ్ సిద్ధికి చేరుకుని సామాజిక కార్యకర్త అన్నా హజారేను కలుస్తారు. అక్కడి నుంచి షిర్డీ వెళ్లి సాయిబాబాను దర్శించుకుని తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. ఆ తర్వాత మే 29 లేదా 30న బెంగాల్, బీహార్‌లో సీఎం పర్యటించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here