దేశంలో కోవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో భాగంగా ప్రస్తుతం 12 ఏళ్లు పైబడివారందరికీ కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీతో పాటుగా 18 ఏళ్లు పైబడిన వారందరికీ ప్రికాషన్ డోస్ పంపిణీ కూడా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ లో భాగంగా ఉచిత కేటగిరీ, ప్రత్యక్ష రాష్ట్ర సేకరణ కేటగిరి ద్వారా ఇప్పటికి మొత్తం 193.53 కోట్లకుపైగా (1,93,53,58,865) కోవిడ్ వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు అందించినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. అలాగే అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో జూన్ 7, మంగళవారం నాటికీ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించేందుకు 14.65 కోట్లకు పైగా (18,34,94,170) నిల్వలు, వినియోగించని వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
3.45 కోట్లమందికిపైగా 12-14 ఏళ్ల పిల్లలకు తొలి డోసు కోవిడ్ వ్యాక్సిన్:
మరోవైపు దేశంలో జూన్ 7, మంగళవారం ఉదయం 7 గంటల వరకు ప్రజలకు అందించిన కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 194.27 కోట్లు (1,94,27,16,543) దాటినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక 12-14 సంవత్సరాల వయస్సు గల వారికి మార్చి 16, 2022న కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రారంభించగా, ఇప్పటివరకు 3.45 కోట్లమందికిపైగా (3,45,58,366) మొదటి డోస్ వ్యాక్సిన్, 1,79,69,120 మందికి రెండో డోస్ వ్యాక్సిన్ అందించినట్టు వెల్లడించారు. అదేవిధంగా 18-59 సంవత్సరాల వయస్సు గల వారికి ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ఏప్రిల్ 10 నుండి కోవిడ్-19 ప్రికాషన్ డోస్ అందించడం ప్రారంభమవగా, ఇప్పటివరకు 27,58,794 మంది ప్రికాషన్ డోస్ తీసుకున్నారు. ఇక 60 సంవత్సరాలు పైబడినవారికీ ప్రభుత్వం ఉచితంగా ప్రికాషన్ డోస్ డోస్ అందిస్తుండగా, ఇప్పటివరకు 1,99,40,173 మంది తీసుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY