నారా లోకేశ్ జూమ్ మీటింగ్‌లో ప్రత్యక్షమైన వైసీపీ నేతలు, పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ

AP YCP Leaders Enters The Zoom Meeting of Nara Lokesh TDP Complaint To Police, AP YCP Leaders Enters The Zoom Meeting of Nara Lokesh, Zoom Meeting of Nara Lokesh, TDP Complaint To Police, YCP Leaders Enters The Zoom Meeting of Nara Lokesh, YSRCP Leaders Join Zoom Call Conducted By Nara Lokesh And Shocks Him, YSRCP Party Leaders Join Zoom Call Conducted By Nara Lokesh, former Andhra Pradesh Ministers Kodali Nani and Vallabhaneni Vamsi attended the Zoom call organised by Nara Lokesh, EX-Andhra Pradesh Ministers Kodali Nani and Vallabhaneni Vamsi attended the Zoom call organised by Nara Lokesh, former Andhra Pradesh Minister Vallabhaneni Vamsi attended the Zoom call organised by Nara Lokesh, former Andhra Pradesh Minister Kodali Nani attended the Zoom call organised by Nara Lokesh, Zoom call organised by Nara Lokesh, Nara Lokesh, General Secretary of the Telugu Desam Party, Telugu Desam Party General Secretary, TDP General Secretary, Nara Lokesh TDP General Secretary, former Andhra Pradesh Minister Vallabhaneni Vamsi, former Andhra Pradesh Minister Kodali Nani, EX-Andhra Pradesh Minister Kodali Nani, EX-Andhra Pradesh Minister Vallabhaneni Vamsi, Vallabhaneni Vamsi, Kodali Nani, Mango News, Mango News Telugu,

ఏపీలో ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షలలో ఫెయిల్ అయిన విద్యార్థులకు వైఎస్సార్‌సీపీ బాధ్యత వహించాలని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు. దీంతో కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ ఘటనలపై టీడీపీ తీవ్రంగా మండిపడింది. ప్రభుత్వం వైఫల్యం వల్లనే ఇంతమంది విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అయ్యారని విమర్శించింది. ఈ నేపథ్యంలో ఫెయిల్ అయిన విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులతో మాట్లాడి, వారికి ధైర్యం చెప్పటానికి నారా లోకేశ్‌ గురువారం వీడియో-కాన్ఫరెన్స్ కాల్ (జూమ్ మీటింగ్) ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలో పార్టిసిపెంట్‌లకు లాగిన్ ఆధారాలను అందించారు మరియు ఉదయం 11 గంటలకు చేరాలని చెప్పారు. అయితే కార్యక్రమం మొదలైన కొన్ని నిమిషాలకే వైఎస్సార్‌సీపీ నేతలు కొందరు స్క్రీన్ పై ప్రత్యక్షమయ్యారు. గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌, వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కో-ఆర్డినేటర్‌ దేవేంద్ర రెడ్డి అలాగే మున్సిపల్‌ కార్పొరేటర్‌ కొత్తపల్లి రజినీ తెరపైకి వచ్చారు. దీంతో ఒకింత ఆశ్చర్యానికి లోనైన లోకేశ్.. వైసీపీ నేతలతో మాట్లాడుతూ, ఇది రాజకీయాలకు వేదిక కాదని, మీరు ఏ విషయం గురించి చర్చ కోరుకుంటున్నారో దానిపై చర్చించడానికి సిద్ధమని, అయితే దానికి ఇది తగిన స్థలం కాదని అన్నారు.

ఈ నేపథ్యంలో ఇరువైపులా కొంత తర్జనభర్జనలు కొనసాగడంతో టీడీపీ నిర్వాహకులు వైఎస్సార్‌సీపీ నేతల కాల్స్‌ను డిస్‌కనెక్ట్ చేసి సభను కొనసాగించారు. దీనిపై టీడీపీ ఏపీ సిఐడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఆ పార్టీ నేత వర్ల రామయ్య పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. రెండు రాజకీయ వర్గాల మధ్య గొడవలు పెట్టాలని చూసిన అధికార వైసీపీ నేత‌ల‌పై మోసం, నేరపూరిత కుట్ర సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని కోరారు. వీలైనంత త్వరగా విచారించి దోషులకు శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + 2 =